Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని ఆశీర్వదిస్తున్నా

– జాబ్ మేళాలో 38 కంపెనీల ప్రాతినిద్యం
– కోవూరు యువత కోసం జాబ్ మేళా నిరంతర ప్రక్రియ
– కోవూరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రీయల్ హబ్ గా మారుస్తా
– విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కోవూరు: నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన మెగా సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్బంగా నా వెంట నడిచి తొలి ఓటు తనకే వేసి తన విజయానికి కృషి చేసిన యువతకు అండగా వుండాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆశించిన దానికన్నా ఎక్కువ మంది జాబ్ మేళా రావడం నిరుద్యోగ సమస్య త్రీవతకు అద్దం పడుతుందన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం రాని వారు నిరుత్సాహ పదాల్సిన అవసరం లేదని విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రక్రియ నిరంతరం కొనసాగు తుందన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఒప్పించి కోవూరు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానన్నారు.

. కోవూరు ప్రాంత యువతకు ఉపాధి కల్పనకు ముందుకొచ్చి జాబ్ మేళాలో భాగస్వాములైన వివిధ కంపెనీ ప్రతినిధులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ యిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జాబ్ మేళా కాన్సెల్టెంట్ సి ఇ ఒ అనూష, శ్రీసిటి సి ఇ ఒ శ్రీనివాసులు రెడ్డి, టాటా స్ట్రైక్ ప్రతినిధి గణేష్, టెక్ మహేంద్ర హెచ్ ఆర్ జగన్, ట్యాగ్ ప్రతినిధి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE