Suryaa.co.in

Andhra Pradesh

సాక్షివి సన్నాసి రాతలు

– 2005లో రాజశేఖర్ రెడ్డికి సక్రమకట్టడంగా కనిపించిన లింగమనేని గెస్ట్ హౌస్, 2020లో జగన్ రెడ్డికి అక్రమకట్టడంగా కనిపించడం పైశాచికత్వం కాక మరేమిటి?
– చంద్రబాబు ఉండే ఇల్లుఒక్కటే అక్రమనిర్మాణం.. మిగతావన్నీ జగన్ రెడ్డికి సక్రమకట్టడాలే. అధికారమదంతో జగన్ తీసుకునే ప్రతినిర్ణయం, చేసే ప్రతిపనిపై టీడీపీప్రభుత్వం రాగానే ఇంతకింత బదులిస్తుంది
• లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్ పై ఏసీబీ కోర్టు తీర్పుకి జగన్ రెడ్డి, అతని అవినీతిమీడియా వక్రభాష్యాలు చెబుతోంది
• పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, క్విడ్ ప్రోకో నుంచి పుట్టిన సాక్షిమీడియాకు, దాని యాజమాన్యా నికి ప్రతిదీ క్విడ్ ప్రోకోగానే కనిపిస్తుంది
• ‘కరకట్టసాక్షిగా క్విడ్ ప్రోకో’ పేరుతో సాక్షిలో కథనంరాసిన సన్నాసులకు కోర్టు తీర్పులు చదవడంరాదా?
• రాజధానిలో క్విడ్ ప్రోకో అని గతంలో జగన్ విషప్రచారంచేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటివిచారణ జరపకుండా తేలుకుట్టిన దొంగలా ఉండిపోయాడు
• గతంలో అధికారంకోసం రాజధానిలో 5లక్షలకోట్ల విలువైనభూములు కొట్టేశారన్న జగన్ రెడ్డి, 4ఏళ్లలో దానిపై ఎందుకు విచారణ జరిపించలేదు?
• విషప్రచారంచేయడం..ప్రజలమెదళ్లలో విషబీజాలు నాటి పబ్బం గడుపుకోవడం జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

జగన్మోహన్ రెడ్డి అవినీతిమీడియా సాక్షి, కోర్టుతీర్పులను వక్రీకరిస్తూ, న్యాయమూర్తుల తీర్పులకు వక్రభాష్యాలు చెబుతోందని, రాజకీయవేధింపులు, కక్షసాధింపులతో గిట్టనివారిపై విషప్రచారమే పరమావధిగా ముఖ్యమంత్రి, అతని నీలిమీడియా వ్యవహరిస్తున్నాయని, ‘కరకట్టసాక్షిగా క్విడ్ ప్రోకో’ అనే వార్తరాసిన సన్నాసులంతా సాక్షిలాంటి అవినీతిపత్రికల్లోనే ఉంటారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“ అమరావతిలో ఏం క్విడ్ ప్రోకో జరిగిందో..ఎలా జరిగిందో.. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్క డుందో సన్నాసిమీడియా సాక్షి సమాధానంచెప్పాలి. కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్డుకోసం చంద్రబాబు క్విడ్ ప్రోకో కి పాల్పడ్డారని చెప్పడం నిజంగా సిగ్గుమాలిన తనమే. కరకట్టపక్కనున్న లింగమనేని గెస్ట్ హౌస్ పై ఏసీబీకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఒకలాఉంటే, సాక్షిమాత్రం వాటిని తనకునచ్చినట్టు మార్చుకొని, టీడీపీఅధినేతపై బురద జల్లడానికి పాకులాడుతోంది.

ఏసీబీ కోర్టు తీర్పుని అర్థం చేసుకోలేని సన్నాసులంతా సాక్షిలో పనిచేస్తూ, తోచినట్టు ప్రచారంచేస్తున్నారు. సాక్షిపత్రికలో పతాకశీర్షికగా ప్రచురించిన ‘కరకట్టసాక్షిగా క్విడ్ ప్రోకో’ అనేకథనం రాసిన సన్నాసికి ఆంగ్లం రాదా…లేక న్యాయస్థానమిచ్చిన తీర్పు అర్థంకాలేదా? ఏసీబీకోర్టు చాలా స్పష్టంగా ‘ ఈ ఆస్తిపై (లింగమనేని గెస్ట్ హౌస్) తదుపరి లావాదేవీలుగానీ, క్రయ విక్రయాలు జరపడంగానీ, ఎక్కడా తనఖాపెట్టడంగానీ కోర్టుఅనుమతిలేకుండా చేయ వద్దు’ అని చెప్పింది. న్యాయస్థానం అలాచెబితే సన్నాసిమీడియా సాక్షి నేరాలుఘోరా లుజరిగిపోయినట్టు అభూతకల్పనలు, అసత్యాలతో దుష్ప్రచారానికి తెరలేపింది.

ప్రజల్ని నమ్మించడానికి విషప్రచారంచేయడం.. తానుఅనుకున్నది జరిగాక తేలుకుట్టి న దొంగలా సైలెంట్ అయిపోవడం జగన్ రెడ్డికి మొదట్నుంచీ అలవాటే. తండ్రి సక్రమకట్టడం అని నిర్ధారించిన నిర్మాణాన్ని కొడుకు అక్రమకట్డడమనడం పైశాచకత్వం కాక మరేమిటి?

గతంలోకూడా అధికారంలోకిరావడానికి జగన్ రెడ్డి ఇదేవిధంగా దుష్ప్రచారంచేసి ప్రజ ల్ని నమ్మించాడు. అతనుచేసిన దుష్ప్రచారంలో అతిప్రధానమైంది రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం. జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం, అతని నీలిమీడియా వైసీపీ అధికారంలోకి రాకముందుచేసిన విషప్రచారాన్నే ఇప్పుడు చేస్తున్నారుగానీ, వాస్త వాలుఏమిటో నిగ్గుతేల్చలేదు. అధికారంచేపట్టి 4ఏళ్లుఅవుతున్నా అదే ప్రచారమా?

ప్రభుత్వాన్ని నడుపుతూ రాజధానిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఎందుకు నిజానిజాలునిగ్గుతేల్చి దోషుల్ని శిక్షించలేకపోయాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇదేసాక్షిమీడియాలో 5లక్షలకోట్ల విలువైనభూముల్ని కొట్టేశారని ఊదరగొట్టారు. ప్రజల్నినమ్మించి అధికారంలోకివచ్చి 4ఏళ్లుఅవుతున్నా మరలా అదే ఎలుక తోలు పట్టుకొని ఉతుకుతున్నారు. అమరావతిని నాశనంచేయడానికే జగన్ ఇలా విషప్రచారంచేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి శ్మశామని, ఎడారని, నిర్మాణానికి పనికిరాదని, చేయాల్సినవిషప్రచారమంతా చేసి, చివరకు రాష్ట్రాన్నే సర్వ నాశనం చేశాడు.

ఆస్తులు అటాచ్ చేయడమంటే అసలు జగన్ అవినీతిఅక్రమాస్తుల్లో జరిగిన అటాచ్ లగురించే ముందు మాట్లాడాలి. తననీలిమీడియా సాక్షిపత్రిక, ఛానె ల్ ఎప్పుడో అటాచ్ చేయబడ్డాయి. సాక్షి కార్యాలయల్లోని ఫర్నీచర్ కూడా అటాచ్ మెంట్ లోనే ఉంది. లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ చేస్తే చంద్రబాబుకి వచ్చిన నష్టమేంటి? 2015లో జీవోనెం – 3739ద్వారా నాటిప్రభుత్వం ఆగెస్ట్ హౌస్ ని అప్పటిముఖ్యమంత్రి అధికారికనివాసంగా ప్రకటించింది.

దానిపై 10-03-2020న అక్రమకట్టడం అని జగన్ నిగ్గుతేల్చాడు. జగన్ అక్రమకట్టడం అంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతులిచ్చింది దివంగతరాజశేఖర్ రెడ్డి. 2005లో నాటిఉడా విభాగం లింగమనేని గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతిచ్చింది. ఆ గెస్ట్ హౌస్ తోపాటే కరకట్టపై అనేక నివా సాలు, ఆశ్రమాలు, ప్రకృతివైద్యశిబిరాలు, మఠాలు, ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. చంద్రబాబు నివాసముండే గెస్ట్ హౌస్ అక్రమకట్టడమైతే, దానితోపాటు ఉన్నవన్నీ కూడా అక్రమకట్టడాలేగా! మరి వాటికెందుకు జగన్ ప్రభుత్వం నోటీసులివ్వలేదు? వాటిని కూల్చేస్తామని, జప్తుచేస్తామని ఎందుకు బెదిరింపులకు దిగలేదు.

లింగమ నేని గెస్ట్ హౌస్ ని సీఆర్డీయే 2015, 2019లో నోటిఫై చేసింది. అక్రమకట్టడం అయితే ఎలా నోటిఫై చేసింది? తండ్రి సక్రమకట్టడమని అన్నిఅనుమతిలిస్తే, కొడుకు దాన్ని అక్రమకట్టడంగా నిర్ధారించడం ఎలాంటిచర్య? ఇలాంటి ఉన్మాదచర్యలు జగన్ సైకోపా లనకు నిదర్శనాలుకావా? విషప్రచారంచేయడం..ప్రజలమెదళ్లలో విషబీజాలు నాటి పబ్బం గడుపుకోవడం జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య. తనకు నచ్చనికట్టడాలు, వస్తువులు, వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ అక్రమాలు.. అవినీతి ప్రతిరూపాలా? తనకు నచ్చితేమాత్రం సక్రమాలా?

ప్రజలఆస్తి అయిన ప్రజావేదిక కూల్చడం.. చంద్రబాబుఇంటిపైకి రౌడీలతో దాడికి వెళ్లిన వాడిని మంత్రిని చేయడం… టీడీపీకార్యాలయంపై దాడికి తెగబడినవాడిని నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ను చేసినప్పుడే జగన్ సైకోపాలన ప్రజలకు బాగాఅర్థమైంది.

రూ.12 నుంచి రూ.14కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసినప్పుడే జగన్ రెడ్డి సైకోయిజం ప్రజలకు అర్థమైంది. ప్రజావేదిక ప్రభుత్వఆస్తి…దాన్నికూల్చడమంటే ప్రజలఆస్తిని నాశనంచేయడమే. ఈ ఇంగితజ్ఞానంకూడా లేకుండా జగన్ దాన్ని కావాల నే నేలమట్టంచేయించాడు. దాన్నికూల్చడం మంచిపద్ధతికాదని, కనీసం ప్రతిపక్షనే తకు క్యాంప్ ఆఫీస్ గా వినియోగించడానికి కేటాయించమని చంద్రబాబు కోరారు. ఆయనవిజ్ఞప్తినికూడా జగన్ ఆలకించలేదు.

ప్రతిపక్షనేతకు ఇంటివసతి, కార్యాలయ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ఆ బాధ్యతతోనే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ రెడ్డి కోరినవిధంగా లోటస్ పాండ్ భవనాన్ని అతని నివాసంగా అనుమతించింది. ప్రతిపక్షనేతనుగౌరవించాలి.. అతనికి ప్రభుత్వమే వసతికేంద్రం కేటాయించాలనే కనీస జ్ఞానం జగన్ రెడ్డికిలేదు. అదీ సైకో జగన్ రెడ్డికి.. సహాయకారి చంద్రబాబుకి ఉన్నతేడా.

చంద్రబాబు నివాసముండే ఇల్లుమాత్రమే అక్రమకట్టడం.. మిగతావన్నీ సక్రమాలే. ఇదీ జగన్ మైండ్ సెట్. ప్రతిపక్షనేత ఇంటిపై దాడికివెళ్లిన తాగుబోతుకి మంత్రి పదవి ఇచ్చినప్పుడే జగన్ పైశాచికత్వం బాగా అర్థమైంది. విజయవాడకు చెందిన ఒకబచ్చాగాడు టీడీపీ కార్యాల యంపై దాడిచేయించాడని వాడికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఇలాంటి దిక్కుమాలిన చర్యలతో, అవినీతిమీడియా చేతిలోఉందని తప్పుడు రాతలు రాస్తూ, మోసాలు, అబద్ధాలతో ఎల్లకాలం ప్రజల్ని జగన్ రెడ్డి మోసగించలేడు.

జగన్ రెడ్డి ప్రతిపక్షంలోఉన్నప్పుడు చంద్రబాబు రూ.6లక్షలకోట్లు మింగేశాడని ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ పేరుతో తప్పుడుసమాచారంతో పుస్తకాలుముద్రించాడు. ముఖ్యమంత్రి అయ్యాకదానిపై నోరెత్తకుండా తేలుకుట్టినదొంగలా ఉండిపోయాడు. జగన్ కక్షసాధింపులు, వేధింపులుసహా, అతనుచేసే ప్రతిపనికి, భవిష్యత్ లో తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయి.” అని బొండా ఉమా హెచ్చరించారు.

LEAVE A RESPONSE