Suryaa.co.in

Andhra Pradesh

టిటిడి నూతన బోర్డు సభ్యుల నియామకంపై బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం

  • తిరుమల పవిత్రతను కాపాడాల్సిందే…
  • బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి:తిరుమల తిరుపతిలో ఎటువంటి వివాదాలు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలోనే తీర్చిదిద్దాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆకాంక్షించారు. అన్యమతస్తుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని భక్తుల మనోభావాలను కాపాడాలని, తిరుమల శ్రీవారి ఆచార సాంప్రదాయ కైంకర్యాలను విఘాతం కలగకుండా చూడాలని, విఐపి ల పేరుతో జరిగే దందాను అరికట్టాలని, దర్శనానికి అందరూ స్వామి వారి ముందు సమానమేనని చాటి చెప్పే విధంగా తిరుమలను తీర్చిదిద్దాలని, తిరుమల పవిత్రతకు అపకీర్తి రాకుండా నూతన బోర్డు విధానాలు ఉండాలని ఆకాంక్షిస్తూ బోర్డు సభ్యులకు మరియు బోర్డు చైర్మన్ టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నూతన టిటిడి బోర్డు ని నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారికి శ్రీధర్ శర్మ ధన్యవాదాలు తెలియజేసారు.

LEAVE A RESPONSE