Suryaa.co.in

Andhra Pradesh

మాదిగల పోరాట విజయానికి బ్రాహ్మణ అభినందనలు

గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు ఆ రుగురు ధర్మాసనం ఇచ్చిన తీర్పును బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ స్వాగతించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టారని, దానికోసం ఆయన ఎన్నో కష్టనష్టాలు భరించారని, ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమాల్లో చనిపోయారని, వీరందరి త్యాగాల ఫలితమే నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజల పక్షాన న్యాయం చేయటంలో న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థకు శ్రీధర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే దళిత జాతులలో చైతన్యం తీసుకొచ్చి పేరు పక్కన కులం పేరు పెట్టుకునే ఆత్మస్థైర్యాన్ని తెచ్చిన ఘనత మంద కృష్ణ కే దక్కుతుందని, ఆయన అలుపెరగని పోరాటం శ్లాగనీయమని, గ గతంలో బ్రాహ్మణులను కించపరుస్తూ సినీ నటుడు మోహన్ బాబు “దేనికైనా రెడీ” అనే సినిమా రిలీజ్ చేసి బ్రాహ్మణ సమాజాన్ని తీవ్రంగా అవమానించాడని,

ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాలు చేసిందని, ఆ ఉద్యమాలకు మందా కృష్ణ బహిరంగబద్ధతును తన ఎమ్మార్పీఎస్ సంస్థ ద్వారా అందజేసి అనాడు బ్రాహ్మణుల పక్షాన అండగా పోరాటంలో నిలిచాడని, దేశంలో బ్రాహ్మణ కుల వర్గం అల్ప జాతిగా వున్నారని,వీరికి అండగా ఎవరు లేరని, అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు బలహీన వర్గాలుగా ఉన్నారని వారికి బలమైన వర్గాలమైన దళిత వర్గాలు ఎల్లపుడూ అండగా ఉండాలని ఆ రోజు ఆయన పిలుపునిచ్చారని శ్రీధర్ గుర్తుచేసుకున్నారు, ఇలాంటి పోరాట స్ఫూర్తి ఉద్యమ నాయకుడు మందకృష్ణ న్యాయ వ్యవస్థ ద్వారా నేడు విజయం సాధించడాన్ని బ్రాహ్మణ సమాజం మనః స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుందని శ్రీధర్ తెలియజేశారు.

దేశ వ్యాప్తంగా మందకృష్ణ చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి దేశంలోనే తొలిసారిగా నైతిక మద్దతు ఇచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ ఫలాలను నారా చంద్రబాబు నాయుడు అప్పట్లోనే అందజేశాడని,ఈ తీర్మానాన్ని అప్పట్లో కేంద్రానికి పంపిస్తే నిర్ణయం తీసుకోకుండా గతంలో కేంద్ర ప్రభుత్వాలు తాత్సారం చేశాయని, గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు వర్గీకరణకు తమ పార్టీ అనుకూలమేనని, వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రచారంలో తెలియజేసారని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా వర్గీకరణకు కట్టుబడి ఉంటారని తాము ఆశిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డమాను ప్రసాదు, ఎండపల్లి శబరి, వంగవీటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE