-టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కె. బుచ్చి రాంప్రసాద్
నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణులను అవమానించి అన్ని విధాల మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా ఓటు రూపంలో బుద్ధిచెప్పాలి. రానున్న శాసనమండలి గ్రాడ్యుయేషన్, టీచర్స్ ఎన్నికల్లో బ్రాహ్మణుల చేతుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదు. అర్చకులకు ఇళ్ళ స్థలాలు, వేతనాలు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా దేవాలయాలపై దాడులు, అర్చకులకు వేధింపులు, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం, అన్యమత ప్రచారంతో అడుగడుగునా వేధింపులకు గురిచేశారు.
వైసీపీ రంగులకు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ గోశాలల స్థలాలను కబ్జా చేయడం, గోవులకు దాణా కూడా అందించకపోవడం సిగ్గుచేటు. ధూప, దీప నైవేద్యాలకు నిధులు ఇవ్వకుండా దేవాలయాలను పాడుపెడుతున్నారు. బ్రాహ్మణ అధికారులకు కీలక పోస్టులు ఇవ్వకుండా వేధించడంతోపాటు అనేక అవమానాలకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి బుద్ధిచెబుదాం.