– రూ. 2 వేల కోట్లతో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ
– కరీంనగర్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమ్మేళనంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు
కరీంనగర్: జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమ్మేళనానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, భారతీయ జనతా పార్టీ పెరుగుతోందనడానికి నిదర్శనం. కరీంనగర్ జిల్లా ఇప్పుడు బీజేపీ అడ్డాగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ లు, వార్డు మెంబర్లు అన్నింటిలోనూ బీజేపీ విజయం సాధిస్తుంది.
కరీంనగర్ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన గడ్డ. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు , మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు , ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లాంటి గొప్పనాయకులను అందించిన గడ్డ ఇది.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇక్కడి ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయి. కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి విస్తర దాదాపు రూ. 2 వేల కోట్లతో జరుగుతోంది.
రాష్ట్రంలో రైల్వేలు, రోడ్ల నిర్మాణాల అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైంది. గ్రామీణ ప్రాంతాలకు 73, 74వ సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు అందిస్తోంది. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.12 లక్షల కోట్లు నిధులు ఇచ్చింది.
కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం — రెండూ కేంద్రం ఏం ఇస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్నదమ్ముల్లాంటివి. అవినీతికి కవలపిల్లలు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఆ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులే, ఎమ్మెల్సీలే బయటపెడుతున్నారు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో విభేదాలు తలెత్తడంతో ఈ విషయాలు చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడింది. కానీ కాళేశ్వరం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి, జిల్లాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమాత్రం న్యాయం చేయలేదు.
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ క్లాసులు మూసేస్తే, స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లా మినిస్టర్‌తో మాట్లాడి, తిరిగి లా క్లాసులు ప్రారంభం అయ్యేలా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి. కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా, ఎక్కడా నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాలివ్వడం లేదు. గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తోంది.
యువ, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు చేశామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ అమలు చేయడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజల్లో మొహం చూపెట్టలేక పార్టీ నాయకులు కాకుండా, రాష్ట్ర ఇంచార్జ్‌లతో పాదయాత్ర చేయాల్సిన స్థితి వచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. కానీ తెలంగాణలో పరిపాలనను గాలికొదిలేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికలు వాయిదా వేయమని అడిగింది. బీఆర్ఎస్ పార్టీ బండారం బయటపడింది. ఆ పార్టీలో నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
గతంలో ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారు. కానీ రెండు పార్టీలతోనూ మేలు జరగలేదు. ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. గ్రామగ్రామాన, పల్లెపల్లెకి వెళ్లి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు.
తెలంగాణలో అవినీతిరహిత, అభివృద్ధితో కూడిన ప్రభుత్వం కావాలి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కేవలం బీజేపీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది, ఇక దోచుకోవడానికి ఏమీ మిగల్లేదనేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.
తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడం లేదు. డీఏలు, పీఆర్సీ బకాయిలు చెల్లించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో 317కు వ్యతిరేకంగా పోరాడి బండి సంజయ్ కుమార్ జైలుకెళ్లారు. టీచర్లకు న్యాయం చేశారు. అందుకే ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు.
బీజేపీ మాత్రమే ప్రజల కోసం పోరాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, పాలనా లోపాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుంది. తెలంగాణలో మార్పు రావాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో కూడా రావడం ఖాయం. రాబోయే స్థానిక సంస్థల నుండి మున్సిపల్ ఎన్నికల వరకు, మున్సిపల్ నుండి అసెంబ్లీ ఎన్నికల వరకు 2028లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయం.