Suryaa.co.in

Telangana

కుట్రలతో గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నం

గువ్వల బాలరాజుపై దాడి అంతా డ్రామా
గువ్వల బలరాజే కనిపించిన వాళ్లపై దాడులు చేస్తారు
ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉంటే ఇలాంటి కుట్రలు సాధారణం
మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం
కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?
రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఘటనలు
బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి?
ప్రభాకర్ రెడ్డిపై దాడిచేసి రాజు రిమాండ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టడం లేదు?
ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియాకు ఎందుకు చూపలేదు?
ఓవైసీ శర్వాణి కింద కాకీ నిక్కర్
అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా?
మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా?
శుక్రవారం నేను మక్కా మసీదు వస్తా
రాజాసింగ్ పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలు కుట్రలతో గెలవాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియా మాట్లాడారు. గువ్వల బాలరాజుపై దాడి విషయంలో తమపై కేటీఆర్ ఆరోపణలు తగవన్నారు. గువ్వల బాలరాజే అడ్డువచ్చిన వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి డ్రామాలు కామన్ అని అన్నారు. గువ్వల బలరాజే కనిపించిన వాళ్లపై దాడులు చేస్తారు.

అసెంబ్లీలో కూడా గువ్వల బాలరాజు ప్రవర్తన అందరూ చూశారు. జెడ్పీ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యేపై దాడి చేశారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు చెప్తే, మా వాళ్లపైనే కేసులు పెట్టారన్నారు.

“గువ్వల బాలరాజుపై దాడి అనేది అంతా డ్రామా. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఘటనలు. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం. ఘటనలే ఇందుకు ఉదాహరణ. కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వలపై దాడి ఘటనలు కుట్రలో భాగమే. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియాకు ఎందుకు చూపలేదు. కొత్త ప్రభాకర్‌రెడ్డి దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలి. ఇప్పటివరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదు.” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి న్నాటకాలాడారు..ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది…కానీ దాడిలో కుట్ర కోణం లేదని… సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారన్నారు. హరీష్ రావుకు… దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. హరీష్ అనుచరులు, రాజు కు మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా ఉంటే బయటపెట్టాలన్నారు. మరో 15 రోజుల్లో ఇంకో మూడు ఘటనలు జరుగుతాయి అని కేటీఆర్ చేసిన ప్రకటనపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కర్ణాటక నుంచి కూలి మనుషులను తెచ్చి కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు తిప్పికొట్టారు. గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారు. కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఛానల్లకు ఫోన్ లు చేశారు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆరెస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోడికత్తి వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసి సానుభూతి పొందాలని బీఆరెస్ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అధికారం కోసం ఎంతటి దారుణానికి తెగబడేందుకు బీఆరెస్ సిద్ధమవుతోంది. మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోకాలికి, బోడిగుండుకు లింకుంపెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?

మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి. ఇప్పుడు పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది. అందుకే డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే కాంగ్రెస్ బేషరతుగా మద్దతిస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు.. బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టండి..బీఆరెస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీ లో రాసి పెడుతున్నాం. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయన్నారు. 24 గంటల కరెంట్ వస్తే ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోమని.. మరోసారి కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ సవాల్

అసదుద్దీన్ ఓవైసీ శర్వాణి లోపల పైజామా ఉందని అనుకున్న ఓవైసీ శర్వాణి కింద కాకీ నిక్కర్ ఉందని అర్థమైందని తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివించాడు కానీ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసదుద్దీన్ మద్దతుగా ఉంటున్నాడు. రాజాసింగ్ పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెపుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ కేసులు లాయర్ ఎవరు? వ్యాఖ్యానించారు.

“నేను హిందువుని. నేను భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తా. దర్గాకి రమ్మన్నా వస్తా. భాగ్యలక్ష్మి టెంపుల్ రమ్మన్నా వస్తా. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో పార్టీ ఓవైసీ పార్టీ ఇచ్చాడు పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? శుక్రవారం నేను మక్కా మసీదు వస్తా. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరాడు.

 

LEAVE A RESPONSE