– కమీషన్లు దండుకుని కేంద్ర నిధులను కూడా డైవర్ట్ చేశారు
– మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపిస్తే మీ ఇండ్లను కూడా కబ్జా చేస్తారు జాగ్రత్త
– కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ కూడా ఇయ్యక గోస పెడుతున్నరు
– వాళ్లను గెలిపిస్తే… నిధులు ఎక్కడి నుండి తెస్తారో సమాధానం చెప్పాలి
– కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
– బండి సంజయ్ సభలకు భారీగా తరలివస్తున్న జనం
కరీంనగర్: బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనబడ్డ జాగాలన్నీ కబ్జా చేసి దోచుకుతిన్నారని మండిపడ్డారు. కరీంనగర్ లో భూకబ్జాలు చేసి ప్రజలను అరిగోస పెట్టిన 46 మంది బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
పొరపాటున బీఆర్ఎస్ ను గెలిపిస్తే…. మీ ఇండ్లను కూడా కబ్జా చేసి పుస్తెల తాడును కూడా దోచుకుంటారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, నన్ను కోసినా డబ్బులు రావని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే… మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి నిధులు ఎక్కడి నుండి తెస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ లోని కోతిరాంపూర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్ రావుతోపాటు 9, 39, 40 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ హాజరయ్యారు. ఈ మూడు డివిజన్ల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఝప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు తీసుకొచ్చిన. నేను ఏం అభివ్రుద్ది చేశాను? ఏయే పనులు చేశానో ఆ వివరాలతో బుక్ లెట్ కొట్టించి ఇంటింటికీ పంపుతున్నా… ఈ బుక్ లో ఉన్న వివరాలు తప్పయితే నాపై కేసు పెట్టుకోవచ్చని సవాల్ చేస్తున్నా….. బీఆర్ఎస్, కాంగ్రెస్ నిజంగా నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తే ఎందుకు ఆ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు?
అంతెందుకు ….మనం నిలబడ్డ ఈ రోడ్డు.. పైన కల్పించే లైట్ల పైసలన్నీ స్మార్ట్ సిటీ నిధులతో వేసినవే.. అంబేద్కర్ స్టేడియం నుంచి గణేష్ నగర్ రోడ్డు దాకా అప్పుడెట్ల ఉండేదో, ఇప్పుడెట్లా ఉందో ఒక్కసారి యాది జేసుకోండి.. అసలు ఈ రోడ్డు ఇంత బాగా అయితుందని ఊహించలేదని ఇక్కడి ప్రజలే చాలా సార్లు నాతో చెప్పారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైంది.
ఒకప్పుడు ముంపు ప్రాంతంగా ఉన్న అల్కాపురి కాలనీ ఇప్పుడు మినీ బంజరా హిల్స్ లెక్క ఎట్లా మారింది? వీధుల్లో సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా మెరుగైంది? ఇటువైపు పెద్దపోచమ్మ టెంపుల్ రోడ్డు ఏ పైసలతో నిర్మించారు? ….కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులే కారణం.
కోతి రాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం గిద్ద పేరిమళ టెంపుల్ వరకు పూర్తయింది. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయినయ్. 39వ డివిజన్లో చాలా సిసి రోడ్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినం. కానీ ఈ ప్రభుత్వము వాటికి నిధులు ఇవ్వకుండా డైవర్ట్ చేస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ లో బిజెపి అధికారంలోకి రాగానే మొదటగా ఈ పెండింగ్ పనులు పూర్తి చేయిస్తాం.
డంపింగ్ యార్డ్ దుస్థితికి మొదటి దోషి బీఆర్ఎస్సే. డంపింగ్ యార్డ్ ను అక్కడ నుంచి తొలగించాలని మీ తరపున కొట్లాడినం. ఆనాటి సీఎంకు కూడా లేఖలు రాసిన. కానీ పట్టించుకోలే. మీరు నన్ను రెండోసారి గెలిపించినంక కేంద్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ గారిని కరీంనగర్ తీసుకొచ్చి వచ్చినం.
50 కోట్ల నిధులు వచ్చినయ్. స్మార్ట్ సిటీలో అక్కడ ఉన్న చెత్తను అప్పటికప్పుడు బయోమైనింగ్ చేసినందుకు 18 కోట్లు కూడా కేంద్ర నిధులు రడీగా ఉన్నయ్. టెండర్ పని కూడా పూర్తయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపకుండా కావాలని జాప్యం చేస్తుంది.
నాడు బిఆర్ఎస్, ఈనాడు కాంగ్రెస్ ఇద్దరూ ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాత్రి అయిందంటే మీకు అక్కడి నుంచి వచ్చే పొగ వల్ల ఎంత కాలుష్యం ఇబ్బంది ఉందో, దుర్వాసనతో ఎంతగా అల్లాడుతున్నారో నాకు తెలుసు. మీకు మాట ఇస్తున్నా….మీరు ఆశీర్వదించి కరీంనగర్ మేయర్ పీఠాన్ని బిజెపికి అప్పగించిన వెంటనే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి మీ ప్రాణాలను, మీ ఆరోగ్యాలను కాపాడుకుంటా…
బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల పార్టీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్నంత కాలం కరీంనగర్ తో పాటు కరీంనగర్ చుట్టుపక్కల కనబడ్డ భూములన్నీ కబ్జాలు చేసి ఎట్లా ఆగమాగం చేసారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ కొందరుఅందిన కాడికి భూమిని స్వాహా చేసి.. తప్పుడు పత్రాలు సృష్టించి పేదల పొట్టన కొట్టారు.
నేనే వాళ్లందరినీ జైలుకు పంపిన. పొరపాటున ఈసారి కూడా బీఆర్ ఎసోళ్లకు ఓటు వేశారో…. మీ ఇంట్లపడి దోచుకుంటరు. మీ పుస్తెల తాళ్లు కూడా కొట్టకపోతరు. ఈడ నిలబడి ఉన్న మీ రెండు అడుగుల జాగ కూడా మాదే అంటారు. వాళ్లను ఇంకా నమ్ముకుంటే …మీ ఇల్లును కూడా అమ్ముకుంటారు..
ఎందుకంటే….వాళ్లకి పైసలు కావాలి.. మాకు ప్రగతి కావాలి. వాళ్లకు మీ భూమి జాగలు కావాలి.. మాకు మీ బాగోగులు కావాలి…వాళ్లకు అవినీతి పనులు కావాలి. మాకు ఆదర్శమైన పాలన కావాలి. అందుకే ఆలోచించండి. బిజెపి కి అవకాశం ఇవ్వండి. ఈ రోజు కరీంనగర్ అభివృద్ధి మీ కళ్ళ.ముందు కనిపిస్తుంది. ఎట్లా కుట్రాలు చేయాలనే విషయంలో వాళ్ళు పీహెచ్డీలు చేశారు.. ఎవరిని ఎట్ల ముంచాలనే విషయంలో వాళ్ళు డబుల్ డిగ్రీలు చేశారు.
భూ రాక్షసుల సమితికి రెండే లక్ష్యాలు. ఎవరి పొట్ట కొట్టాలి. ఎట్లా పైసలు సంపాదించాలి. ఈ రెండే వాళ్ళ నినాదాలు. అందుకోసమే.. ఓట్లప్పుడు మీకు దండాలు పెడతారు. తర్వాత మీ జీవితాలతో ఆటలాడుకుంటారు. ఈ భూ రాక్షసుల మీద పోలీస్ స్టేషన్లలో 2 వేల 600 కుపైగా ఫిర్యాదులు అందాయంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా సాగాయో గుర్తించండి. పొరపాటున ఇట్లాంటోళ్లను పాపం పోనీలే జాలి చూపి ఓట్లేస్తే… మనకు పాపం తగులుతది. అందుకే.. ఈ ఒక్క సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ఇగ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం వద్ద పైసల్లేవు. 6 గ్యారంటీలను అమలు చేయడం లేదు. నన్ను కోసినా నయాపైసా లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి కాంగ్రెస్ ను గెలిపిస్తే.. కరీంనగర్ అభివ్రుద్ధికి ఎక్కడి నుండి తీసుకొస్తారు? దొంగ నోట్లు ఏమైనా ముద్రిస్తారా?…
పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి కావాలంటే ఏం చేస్తారు? బీజేపీని గెలిపించి మేయర్ పీఠం అప్పగిస్తే…. కరీంనగర్ కు ఎన్ని వందల కోట్లు అయినా నేనిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన పైసలన్నీ కేంద్రం ఇచ్చినవే. పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే కార్పొరేటర్లను ఢిల్లీ తీసుకెళ్లి మోదీని కలిసి పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది.
ఇగ బీఆర్ఎస్ కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే… ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను నిలదీయండి. భూకబ్జాలతో ప్రజలను అరిగోస పెట్టిన బీఆర్ఎస్ ను, దొంగ హామీలతో నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీయండి
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని సవాల్ విసురుతున్నా… మేం ఏం చేశామో ఎన్ని నిధులు తెచ్చామో బుక్ లెట్ ప్రింట్ చేసిన. వాటిపై చర్చించేందుకు సిద్ధం.. కమీషన్ల పేరుతో సర్వనాశనం చేస్తున్నరు. నేను ఢిల్లీ నుండి నిధులు తెస్తే… వాళ్లు కొబ్బరికాయ కొట్టి మేమే నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పైగా బండి సంజయ్ నయాపైసా తెచ్చినట్లు చూపినా మూట ముల్లె సర్ధుకుని కరీంనగర్ వదిలివెళ్లిపోతానని మాట్లాడుతున్నడు.
ఈ బుక్ లెట్ ను ఆయనకు పంపించిన. మరి సదువుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపోతారో లేదో ఆలోచించుకోవాలి. కరీంనగర్ లో 56 మంది కార్యకర్తలకే టిక్కెట్లు ఇచ్చాం. వాళ్లు దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడే కార్యకర్తలు. కొన్ని రాజకీయ సమీకరణలు, గెలుపు అవకాశాల ద్రుష్ట్యా టిక్కెట్లు రాకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ పడాల్సిన పనిలేదు. ఎవరికైనా టిక్కెట్ రాకపోతే వారికి పార్టీ పరంగా న్యాయం చేస్తాం.
కరీంనగర్ లో కాంగ్రెస్ అంటే ‘ఖాన్’ గ్రేస్ పార్టీగా మారిపోయింది. అసలా పార్టీకి గ్రేస్ లేనే లేదు. ఈ ఎన్నికల్లో అసలు రేస్ లోనే లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నయ్. కరీంనగర్లో కాంగ్రెస్ కు లీడర్ ఎవరంటే చెప్పలేని దుస్థితి.
ఇయ్యాల ఒక లీడర్ చేతుల ఆ పార్టీ ఉంటది. మల్ల గంట తరువాత ఇంకొకాయన వచ్చి నేనే ఇక్కడ లీడర్. నా చేతుల్లోనే పార్టీ ఉందని అంటడు. అసలా పార్టీ ఇక్కడ ఎవరి చేతిలో ఉందో పైనున్న కాంగ్రెసోళ్లకే తెల్వదు. అట్లాంటోళ్ల చేతుల్లో మన కార్పొరేషన్ ను పెడితే పరిస్థితి ఏందో మీరే ఆలోచించండి. అనవసరంగా ఆగం కావొద్దు మనం.. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి. ప్రభుత్వం వద్ద పైసల్లేవు. జీతాలియ్యడానికే పైసల్లేవు. అభివ్రుద్ధి పనులకు అణా పైసలిచ్చే పరిస్థితి లేదు.
ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలియ్యకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు సదువుకు దూరమైర్రు. ఆరోగ్యశ్రీ బకాయిలియ్యకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు దూరమై లక్షల మంది పేదలు అరిగోస పడుతున్నరు. పిట్లల్లా రాలిపోతున్నరు. 6 గ్యారంటీలకు దిక్కులేదు.. మేనిఫెస్టో హామీలను గాలికొదిలేసిర్రు… సిగ్గు లేకుండా ఎన్నికలై పోంగనే ఇంటి పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి మీ నడ్డి విరగ్గొట్టడానికి సిద్ధమైనరు…. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నరో నిలదీయండి.
నేను కోరేదొక్కటే….. నాకు మీరే బలం.. నాకు మీరే బలగం… మనమంతా కాషాయ జెండా పట్టుకుని.. ధర్మంతో ముందుకు సాగుదాం. ఆదర్మం గా.. అన్యాయంగా.. అవినీతి పరంగా మీ ముందుకు వచ్చే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించoడి. 11 ఏళ్ల మోదీ అభివ్రుద్ధికి, 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దమిది.
రెండేళ్ల పాలనలో చిల్లి గవ్వ కూడా ఇవ్వని కాంగ్రెస్ కు, రెండేళ్లలో అభివ్రుద్ధి పనుల కోసం వందల కోట్లు కేటాయించిన బీజేపీకి మధ్య జరుగుతున్న యుద్దమిది. కరీంనగర్ అభివ్రుద్ధి కోసం నిధులు తెచ్చి యుద్దం చేసే బీజేపీకి కత్తి ఇస్తారా?… డాంబికాలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పట్టం కడతారా?… ఆలోచించాలని కోరుతున్నా..