Suryaa.co.in

Telangana

రేవంత్ ది పాదయాత్ర కాదు… కాంగ్రెస్ కు పాడే గట్టే యాత్ర

-పెయింటర్ గా జీవితం ప్రారంభించిన రేవంత్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి?
-రేవంత్ ను మించిన పొలిటికల్ బ్రోకర్ ఎవ్వరూ లేరు
-రేవంత్ రాజకీయ వ్యభిచారి.. ఓ బ్రోకర్
-బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

రేవంత్ రెడ్డి నిన్న బాల్కొండలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. రేవంత్ ది పాదయాత్ర కాదు. కాంగ్రెస్ కు పాడే గట్టే యాత్ర.ఎక్కడికి పోతే అక్కడి ఎమ్మెల్యేలను తిడుతున్నారు. రేవంత్ రెడ్డి వృత్తి బ్లాక్ మెయిలింగ్. రేవంత్ రాజకీయ వ్యభిచారి.. ఓ బ్రోకర్.సచివాలయంల,అమర వీరుల స్మారక కేంద్రం, బీ ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణం లో అవినీతి అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడారు.సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిలింగ్ కు వాడుకునే రేవంత్ ఇపుడు కూడా వీటిపై సమాచారం తీసుకోవచ్చు.

తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు ఎక్కడిది? తెలంగాణ అమరవీరులకు కారణం రేవంతే కదా?చంద్రబాబు సంక లో జొర్రి తెలంగాణ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.పెయింటర్ గా జీవితం ప్రారంభించిన రేవంత్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి?మంత్రి ప్రశాంత్ రెడ్డి ని అవినీతిపరుడని విమర్శిస్తావా?ప్రశాంత్ రెడ్డి గురించి వాళ్ళ నాన్న సురేందర్ రెడ్డి గురించి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు.

జి.ఎస్.టి
రేట్లు 6 శాతం నుంచి 18శాతం పెరిగాయి.. అంచనా వ్యయాలు పెరిగితే పెరిగి ఉండవచ్చు.కేసీఆర్ పాలన లో అవినీతి కి చోటే లేదు.రాహుల్ గాంధీ తో మల్లికార్జున ఖర్గే తో ఎపుడైనా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించజేశావా రేవంత్?రేవంత్ పిచ్చి ప్రేలాపనులు చేస్తే తన్ని తరిమేస్తారు.కమీషన్లు రేవంత్ కు కాంగ్రెస్ కు అలవాటు.తమ లాగానే అందరూ అవినీతి చేస్తారని రేవంత్ అనుకుంటున్నారు.రేవంత్ ను మించిన పొలిటికల్ బ్రోకర్ ఎవ్వరూ లేరు.

ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ రావు ఏమన్నారంటే……..
తెలంగాణ కేసీఆర్ పాలనలో దేశానికి రోల్ మోడల్ అయ్యింది.దేశానికి ఎవ్వరు వచ్చినా తెలంగాణ నే ముందు సందర్శిస్తున్నారు.అమర వీరుల ఆత్మలు రేవంత్ వ్యాఖ్యలు ఘోషిస్తున్నాయి.ప్రశాంత్ రెడ్డి కాలి గోటి కి కూడా రేవంత్ సరిపోరు.అమర వీరుల స్మారక కేంద్రం వ్యయం పెరగడానికి స్టీల్ ,సిమెంట్ రేట్లు పెరగడమే కారణం.సచివాలయానికి ఇప్పటి వరకు 470 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది.. వాస్తవాలు వక్రీకరించొద్దు.పీసీసీ అధ్యక్షుడు గా ఉండి బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.
రేవంత్ ఓటుకు నోటుకు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారు..రాబోయే రోజుల్లో రేవంత్ కు జైలులో చిప్ప కూడే గతి.ప్రశాంత్ రెడ్డి కి రేవంత్ కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంది.రేవంత్ ఉండేందుకు జైలే అనువైన స్థానం.. ప్రజా క్షేత్రం కాదు.రేవంత్ ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

LEAVE A RESPONSE