September 24, 2026

బీఆర్ఎస్ పాలన విద్యుత్ రంగానికి స్వర్ణయుగం

  • థర్మల్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్ర
  • కనీసం బొగ్గు సరఫరా కూడా చేయడం లేదు
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందింది. 2014 జూన్ 2న రాష్ట్ర ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుగా ఉండగా, 2023 నాటికి అది 18,567 మెగావాట్లుకు పెరిగింది. మొత్తం 10,978 మెగావాట్లు పెరిగింది.

4,426 మెగావాట్ల నుంచి థర్మల్ విద్యుత్ 9,582 మెగావాట్లకు, జలవిద్యుత్ 2,158 మెగావాట్ల నుంచి 2,518 మెగావాట్లకు, సౌర విద్యుత్ 74 మెగావాట్ల నుంచి 5,347 మెగావాట్లకు పెరిగింది. గరిష్ట డిమాండ్ 6,666 మెగావాట్ల నుంచి 15,497 మెగావాట్లకు పెరిగింది. ఏకంగా 9836 మెగావాట్ల వినియోగం పెరిగింది గరిష్ఠ దినసరి వినియోగం 124 మిలియన్ యూనిట్ల నుంచి 298 మిలియన్ యూనిట్లకు, తలసరి వినియోగం 1,196 యూనిట్ల నుంచి 2,140 యూనిట్లకు.. ట్రాన్స్‌మిషన్ (ఈహెచ్‌టీ) నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా 400 కేవీ సబ్-స్టేషన్లు 6 నుంచి 30కి, 220 కేవీ సబ్-స్టేషన్లు 51 నుంచి 103కు, 132 కేవీ సబ్-స్టేషన్లు 176 నుంచి 251కి, మొత్తం ఈహెచ్‌టీ సబ్-స్టేషన్లు 233 నుంచి 384కు పెంచడం జరిగింది.

ఈహెచ్‌టీ లైన్ల పొడవు: 16,378/16,379 కిలోమీటర్ల నుంచి 28,131 కిలోమీటర్లకు, ట్రాన్స్‌ఫర్మేషన్ కెపాసిటీ 14,973 ఎం.వి.ఏ. నుంచి 38,941 ఎం.వి.ఏ కు పెంచాం దీని మూలంగా విద్యుత్ సరఫరా స్థిరత్వం, నష్టాల తగ్గింపు, లోడ్ నిర్వహణ మెరుగుపడ్డాయి 33 కేవీ సబ్-స్టేషన్లు 2,138 నుంచి 3,210కి, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 3,272 నుంచి 5,691కు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 4,61,937 నుంచి 8,60,239కు పెంచాం వ్యవసాయ వినియోగదారులు: సుమారు 19.03 లక్షల నుంచి 27.02 లక్షలకు పెరిగారు.

2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్న పరిమిత విద్యుత్ సామర్థ్యం, సబ్-స్టేషన్లు, లైన్లు, కనెక్షన్ల స్థాయి నుంచి 2023 నాటికి ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువగా, ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ విస్తృతంగా, వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెంచాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత థర్మల్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్రలో భాగంగా కనీసం బొగ్గు సరఫరా కూడా చేయడం లేదు
పదేళ్ల పాలనలో పటిష్టమైన ప్రణాళికతో రూపొందించిన వ్యవస్థను మూడేళ్ల కాంగ్రెస్ పాలనతో విధ్వంసం చేసింది కనీసం రైతులకు ఏడు గంటల కరెంటు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నది కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందని ఎత్తిపోతల మోటార్లను నిలిపివేసింది

Total Visitors: 2,855,776