Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్

కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్
మైనారిటీ ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి
హిందువులను అవమానిస్తున్నాయి
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

బీజేపీ అంటే సబ్ కా వికాస్.. బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్.. కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ అంటూ బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు నిర్వచనమిచ్చారు. ఆ రెండు పార్టీలలో పని చేస్తున్న వారు ఆ కుటుంబాలకు బానిసలుగా వ్వవహరిస్తున్నారు.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని ధ్వజమెత్తారు.

ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఇస్తామని మాటలు చెబుతుంది.. డిక్లరేషన్లు, గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజలని మరోసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. మైనారిటీ ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.. హిందువులను అవమానిస్తున్నాయి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించలేదు.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇక్కడ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించ లేదు అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.

ఇప్పుడు ఎన్నికల కోసం హామీలు ఇస్తున్నారని డాక్టర్ కె. లక్ష్మణ్ గారు అన్నారు. సామాజిక న్యాయం లో భాగంగా నే బీసీ నీ సీఎం చేస్తామని బీజేపీ చెబుతుంది.. బీసీ సీఎం అంటే బీసీల కోసం కాదు సమాజంలోని అన్ని వర్గాల కోసం.. కేసీఆర్ లేస్తే మనిషినీ కాదు అని అంటాడు కాని లేవడు.. కాపలా కుక్కల ఉంటానని అన్న కేసీఆర్ గుంట నక్కలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

నువ్వు కొట్టినట్టు చేయ్యు.. ఏడ్చినట్టు చెయ్యు అన్నట్లు వారి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటే.. గతంలో కాంగ్రెస్ తో ఆ పార్టీ ఉంది.. బీజేపీ మానిఫెస్టో ఓట్ల కోసం కాదని, అమలుకు నోచుకోని హామీలు ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. ఓవైసీ , రేవంత్ రెడ్డిలు ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు.. కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రీటైల్ గా, హోల్ సేల్ గా అమ్ముడు పోతారు.. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా చెప్పారని లక్ష్మణ్ గుర్తుచేశారు. బీసీ, ఎస్సీలతో పాటు అన్ని వర్గాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. బిజెపి విజయం ఖాయం. విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కొందరు కుళ్ళుతో బిజెపి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అని అన్నారు.

LEAVE A RESPONSE