Suryaa.co.in

Andhra Pradesh

హత్యారాజకీయాలకు పెట్టింది పేరు వైఎస్ కుటుంబం

– దానిలో భాగమే కోతికత్తి డ్రామా.. బాబాయ్ గొడ్డలి పోటు
– ముఖ్యమంత్రిని హతమార్చడానికి ఒకకులం ప్రయత్నిస్తోందన్న నారాయణస్వామివ్యాఖ్యలు వైసీపీలోని వర్గపోరుకి నిదర్శనం
– పీకే వ్యూహాంలో భాగంగానే టీడీపీని ఒకకులానికి పరిమితంచేసే కుట్రలకు వైసీపీ తెరలేపింది
• జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఒకకులం ప్రయత్నిస్తోందన్న నారాయణస్వామి వ్యాఖ్యలు, వైసీపీలోని వర్గపోరుకి సంకేతం
• అధికారపార్టీలోని వారే ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా.. ఎప్పుడు సీఎంకుర్చీ దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు.
• మీడియాసంస్థలపై, నిజాలునిర్భయంగా వెల్లడిస్తున్నఏబీఎన్ రాధాకృష్ణవంటి వారిపై కక్షసాధింపులు మాని, ముఖ్యమంత్రి ఇంటిదొంగలపై దృష్టిపెట్టాలి.
• పీకే (ప్రశాంత్ కిషోర్) ఆలోచనలప్రకారమే వైసీపీనేతలు టీడీపీని ఒకకులానికి పరిమితంచేసే ప్రయత్నం చేస్తున్నారు.
• డిప్యూటీ సీఎంచెప్పిన కులంవారేఇప్పుడు ఈ ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్నారు.వారుకూడా ముఖ్యమంత్రిని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారా?
• సజ్జల రామకృష్ణారెడ్డి ఉస్కో అనగానే భౌభౌమంటూ ఉరికొచ్చే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ వంటి వాళ్లు కూడా నారాయణస్వామిచెప్పిన కుట్రలో భాగస్వాములా?
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కుటుంబమని చెబుతారని, రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే, ఆయనకుటుంబం హత్యరాజకీ యాలకు పెట్టిందిపేరని, ఏపీ ఉత్తముఖ్యమంత్రి అలియాస్ ఉపముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఒకవర్గం కుట్రలు చేస్తోందనిచెప్పడం వింటే, విచిత్రంగా ఉందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్రప్రాంత పార్టీ ఇన్ ఛార్జ్ బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ముఖ్యమంత్రి కేసులుఎప్పుడు బయటకు వస్తాయా..ఆయనెప్పుడు జైలుకువెళతాడా …ఎప్పుడు సీఎంకుర్చీలో కూర్చుందామా అని ప్రభుత్వంలోని ఒకవర్గంవారే ఎదురు చూస్తు న్నారన్న వాస్తవాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విస్మరించినట్టున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిందే సానుభూతి పునాదులపైన. తనతండ్రి చనిపోయినప్పుడు, ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించింది వాస్తవంకాదా? తండ్రి చావుని తనరాజకీయభవిష్యత్ కోసం వాడుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా? గతంలో అధికా రంలోకి రావడానికి కోడికత్తి డ్రామానునడిపించింది జగన్మోహన్ రెడ్డే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కోడికత్తి కేసుఏమైందో… సదరుకేసుతాలూకా నిందితుడుఏమయ్యాడో ఇంతవరకు ప్రజలకు తెలియదు.
జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృతక్రీడలో మరోప్రధానమైన ఘట్టం వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య. గొడ్డలితో దారుణంగా నరికి, మెదడుకూడా బయటకువచ్చేలా దారుణంగా వివేకానం దరెడ్డిని హత్యచేశారు. రక్తపుమడుగులో పడిఉన్న వివేకాను, గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించడానికి ప్రయత్నించింది వైసీపీనేతలు, ఆపార్టీ కాదా? వివేకాహత్యకేసులో అసలు దోషులను పట్టుకోవాలంటూ ఆయన కుమార్తె

కోర్టులను ఆశ్రయిస్తే, హత్యకేసతాలూకా విషయాలు బయటకురాకూడదని, నిందితులను అరెస్ట్ చేయకూడదని కోరుతూ ఈ ప్రభు త్వంలోని కొందరు దుర్మార్గులు న్యాయస్థానం నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దాన్ని బట్టే అర్థమవుతోంది… బాబాయ్ హత్యకేసులో అసలు దోషులెవరో..వారిని కాపాడుతున్న వారెవరో? జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ప్రత్యేకంగా ఒకకులం రాష్ట్రంలో ప్రయత్నిస్తోం దని, పెద్దఎత్తున చందాలుపోగేస్తోందని కూడా డిప్యూటీసీఎం పిచ్చికూతలు కూశారు.
ఆయన చెబుతున్న కులంలోనే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నకొడాలినానీ లేడా? సజ్జలరామకృష్ణారెడ్డి ఉస్కో అనగానే బయటకువచ్చి భౌభౌమని మొరిగే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ సహా, అనేకమంది లేరా? వారంతాకూడా డిప్యూటీ సీఎం చెప్పినకుట్రలో భాగస్వాములుగాఉన్నారా? సదరుకులానికి తామేపెద్దవాళ్లమని చెప్పుకుంటున్న వారంతా ప్రధానంగా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. వారంతా జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి చందాలుపోగుచేస్తున్నారన్నది ఉత్త(ఉప) ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లోని అంతరార్థమా?
తెలుగుదేశంపార్టీని కేవలం ఒకకులానికి అంటగట్టడానికి ప్రభుత్వమే పెద్దఎత్తునకుట్ర చేస్తోం దన్న అనుమానం కలుగుతోంది. కాబట్టే పీకే (ప్రశాంత్ కిషోర్) సారథ్యంలో టీడీపీని కేవలం ఒకకులానికే అంటగట్టాలని వైసీపీప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశంపార్టీ కేవలం ఒక కులానికి చెందినది కాదు..దానికి కులాన్ని అంటగట్టడం అంటే, మండేసూర్యుడిపై ఉమ్ము వేయడమే అవుతుంతి. టీడీపీ బలుగుబలహీనవర్గాలపార్టీ. ఆపార్టీలో బీసీలు ఎలా ఎదిగారో.. ఇతరకులాలవారుఎలా ఎదిగారో లెక్కలు బయటకు తీస్తే, ఈ ప్రభుత్వానికి, వైసీపీ వారికి వాస్తవాలు బోధపడతాయి.
వైసీపీకి ఒకసిద్ధాంతం అనేది లేదు. అధికారంలోకి రాకముందు ఒకలాగా..వచ్చాలాగా మరో మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి, ఆయనపార్టీ వారికి అవినీతితో పెట్టిన విద్య. అధికారంలోకి రాకముందు తనతండ్రి చావుకి రిలయన్స్ సంస్థే కారణమని జగన్మోహన్ రెడ్డి అమాయకులై న ప్రజలను రెచ్చగొట్టి, తనపబ్బం గడుపుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ సంస్థవారి మోచేతినీళ్లు తాగుతున్నాడు. వారుచెప్పినవ్యక్తికే రాష్ట్రంనుంచి రాజ్య సభ స్థానం కట్టబెట్టాడు.
చంద్రబాబుని గురించి ఏ వైసీపీ కుక్క భౌభౌమని మొరిగినా, ఇకనుంచి సింహాల్లాచీల్చి చెండాడుతామని హెచ్చరిస్తున్నా. వైసీపీ వారుఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే, చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రెండున్నరేళ్లపాలనలో టీడీపీకి చెందిన 40మంది హత్యగావించబడ్డారు. కార్యకర్తలపై తప్పు డు కేసులుపెట్టి జైళ్లకు పంపుతున్నారు. ఇంతచేసినా టీడీపీ నేతలు, కార్యకర్తలు బెదరడం లేదనే ఇప్పుడు నీతిమాలిన కులరాజకీయాలకు ఈ ప్రభుత్వ తెరలేపింది. చంద్రబాబునా యుడి గారికి, లోకేశ్ గారికి కులాన్నిఆపాదించి పబ్బం గడుపుకోవాలన్న పాలకులు ప్రయ త్నాలు నెరవేరవని తేల్చిచెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావే శాలు వ్యక్తమవుతున్నందునే, వైసీపీనేతలు పీకేమార్గదర్శకత్వం ప్రకారం కావాలనే కులాల కుంపట్లురాజేయడానికి సిద్ధమయ్యారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి కూడా అప్రమత్తమవ్వాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన కొందరు, జగన్మోహన్ రెడ్డికి హానితలపెట్టే ప్రమాదం ఉందేమోనని తమకు అనిపిస్తోంది. కాబట్టి, ముఖ్యమంత్రి ఇకనుంచి మరింత జాగ్ర త్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నాం.
తనదారికి రావడంలేదనే ఈ ముఖ్యమంత్రి, ఏబీఎన్ రాధాకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించాడు.
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రభుత్వతప్పులను, పాలకులు అవినీతినిఎత్తిచూపూతూ, నిజాలను నిర్భయంగా ప్రజలముందు ఉంచుతూ, అన్యాయంచేస్తున్నవారి బండారాన్ని బయటపెడుతున్నారు.అది తట్టుకోలేకనే వైసీపీనేతలు, ప్రభుత్వంలోని వారు ఆయన్నిఇష్టా నుసారం దూషిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో ఆయనకు వస్తున్న మద్ధతుని తనమీడియాలో బ్రహ్మండంగా చూపినవ్యక్తి రాధాకృష్ణగారు. అలాంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రికి చెడ్డవాడిగా కనిపించడం శోచనీయం.
గతంలో టీడీపీ నుంచి, ఇతర రంగాల నుంచి వైసీపీలోకి వెళ్లినవారంతా కేవలం ఈ ముఖ్యమంత్రికి భయపడి వెళ్లిన వారే. పత్రికలపైనే, న్యూస్ ఛానళ్లపైన, వాటియాజమాన్యాలపైనే తప్పుడుకేసులు పెట్టడం వెనకున్న ప్రభుత్వఉద్దేశాన్ని ప్రజలు గ్రహించలేని స్థితిలోలేరు. మీడియా తన అవినీతిని, తన తప్పులను ప్రశ్నించడాన్ని ముఖ్యమంత్రి ఓర్వలేకపోతున్నాడు. దానిలోభాగమే ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై పెట్టిన తప్పుడుకేసులు. ఇలాంటిచర్యలకు ముఖ్యమంత్రి తక్షణం స్వస్తి పలక్కపోతే, ప్రజలే ఆయనకు, ఆయనప్రభుత్వానికి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెబుతారని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా బయటఉన్న వారిని వదిలేసి, తనపార్టీలో ఉన్న తనశత్రువులపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE