Suryaa.co.in

Telangana

బడ్జెట్‌ కార్పోరేట్‌ సంస్థలు సంతృప్తి.. మధ్యతరగతి ప్రజలకు అసంతృప్తి

– సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పోరేట్‌ సంస్థలు సంతృప్తి పరిచేదిగాను, మధ్యతరగతి ప్రజలకు అసంతృప్తి కలిగే విధంగా వుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. ఆర్థిక మంత్రి నర్మగర్భంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, ఎలాంటి ప్రాముఖ్యత లేకున్నా ప్రక్కనున్న ప్రధానమంత్రి జబ్బలు చర్చుకుంటునాడని అన్నారు.

కోవిడ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్య, వైద్యరంగానికి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. ఉద్యోగస్తుల జీతాల పన్నులలో స్లాబ్‌లో ఏర్పాటు చేస్తారనుకున్న ఉద్యోగస్తులను మోసం చేశారని, 20 వేల రూపాయల జీతం దాటిన ఉద్యోగి కూడా 5 శాతం పన్ను కట్టాల్సి వస్తుందన్నారు. నరేంద్రమోడి భారత దేశ ప్రధానిగా వ్యవహరించకుండా గుజరాత్‌ను మినీ భారత్‌గా మార్చారని, అక్కడ ఎక్కువ నిధులు ఖర్చుపెడుతున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు వున్నందున కొంత కేటాయింపులు చేశారని నారాయణ అన్నారు.

LEAVE A RESPONSE