Suryaa.co.in

Andhra Pradesh

రక్షణ గోడలు నిర్మించి, ఏలేరు వరదను అడ్డుకోండి

– ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశం

జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఏలేరు వరద ఉధృతితో గండ్లు పడిన ప్రాంతాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఆర్టీవో సీతారామారావు ఇరిగేషన్ ఏఈ శేషగిరిరావు, ఇరిగేషన్ డిఈ శ్రీను లతో కలిసి పరిశీలించారు. అనంతరం తిరుమలి రెగ్యులేటర్ పరిస్థితిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ అధికారులతో మాట్లాడుతూ జగ్గంపేట మండలం ఇర్రిపాక నుండి కిర్లంపూడి మండలం ముక్కుల్లు వరకు ముంపు ప్రాంత గ్రామాలలో ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలని ప్రతిష్టమైన చర్యలు చేపట్టి రాబోయే రోజుల్లో ఏలేరు వరదను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కుంచే తాతాజీ, బదిరెడ్డి అచ్చన్న దొర, మల్లిరెడ్డి సిరి, మండపాక అప్పన్న దొర పాఠం శెట్టి బాబ్జి, జ్యోతుల వీరభద్రరావు, మంచం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE