-సీతారామ పేరిట రీ డిజైన్ తో ప్రజాధనం దుర్వినియోగం
-ఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి నీరు ఇవ్వని గత బిఆర్ఎస్ ప్రభుత్వం
-ఎన్కూర్ లింకు కెనాన్ కు రాజీవ్ కెనాల్ గా నామకరణం
-మంత్రులతో కలిసి సీతారామ ప్రాజెక్టుపై సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసిన మాజీ సీఎం కేసీఆర్: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
-6 గంటల పాటు సీతారామ ప్రాజెక్టు పనుల పరిశీలన
-కెనాల్ వెంట 63 కిలోమీటర్లు ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు
ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను, అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
అక్కడి నుంచి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్- 1 వద్దకు చేరుకొని పంప్ హౌజ్ పనులను పరిశీలించిన అనంతరం పవర్ సప్లై ను ప్రారంభించారు. ఆ తర్వాత పంపు హౌజ్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్షంచమన్నారు. సీతారామ ప్రాజెక్టు కు ఎన్ఎస్పిఎల్ కెనాల్ కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ లింక్ కెనాల్ ను పూర్తి చేయడానికి 72 కోట్లు రూపాయలు మంజూరి చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పంప్స్ ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులు ఇచ్చామన్నారు.
పంప్స్ ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు
ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసిన కేసీఆర్: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టార్ను గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోలుకోలేని విధంగా ఆర్థికంగా చాలా నష్టం చేసిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు 90 4000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేవలం 93000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తీసుకువచ్చిందని వివరించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఎకరం కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. గత బిహారీ సర్కార్ మొదలుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను 10 సంవత్సరాల పాలనలో పూర్తి చేయలేని అసమర్ధత ప్రభుత్వమని విమర్శించారు. కొత్తగూడెం పినపాక భద్రాచలం నియోజకవర్గం హామీ ఇచ్చారు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతున్నదని వివరించారు.