-ప్రజల ప్రాణాలు “గాలిలొ దీపంగా” మారింది!!
-రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి జిల్లా అదికార పార్టీ ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని నేషనల్ హైవే,అర్&బి,పోలీస్,ప్రభుత్వ అధికారులతో సమావేశం ఎర్పాటు చేసి సాధ్యా సాద్యాలపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నవీన్ డిమాండ్!
తిరుపతి చంద్రగిరి బైపాస్ రోడ్ తిరుచానూరు మార్కెట్ యార్డు క్రాసింగ్ లను దాటి తనపల్లి వైపు, ఎం ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ దాటి మల్లంగుంట వైపు,తుమ్మలగుంట అర్చ్ దాటి రామానుజ పల్లి వైపు,తోండవాడ నుంచి సత్తార్ బైలు ద్వారా పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు ప్రతి నిత్యం వెళ్లే వేలాది మంది ప్రజలు హైవేలో ఇరువైపుల వస్తున్న “వాహనాల మితిమీరిన స్పీడు” కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, క్షతగాత్రులవుతున్నారని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు!
“తిరుపతి బైపాస్ రోడ్లలో నేషనల్ హైవే అథారిటీ మరియు జిల్లా పోలీస్ అధికారుల సమన్వయంతో హైవే రోడ్ క్రాసింగ్ ల వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో…
1) “సిగ్నల్ పాయింట్” లు ఏర్పాటు చేయాలని,
2) హైవే లో “స్పీడ్ లిమిట్ గన్స్” ఏర్పాటు చేసి వాహనాల స్పీడును నియంత్రించాలని
3) హైవేలో డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించే “స్పీడ్ నియంత్రణ సూచిక బోర్డులు” ఏర్పాటు చేయాలి
4) అవసరమైతే “ఫ్లై ఓవర్” లు ఏర్పాటు చేయాలని నవీన్ డిమాండ్ చేశారు”
తిరుపతి బైపాస్ రోడ్లకు ఇరువైపులా హోటల్స్,అపార్ట్మెంట్స్,ఫుడ్ కోర్ట్స్,డాబాలు,ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు,హాస్టల్స్,వివిధ రకాల వ్యాపార సంస్థలు అధికంగా ఉండడంతో ప్రతినిత్యం పరిసర గ్రామాలనుంచి బైపాస్ రోడ్ల మీదుగా నగరంలోకి టూ వీలర్స్ కార్ల ద్వారా రాకపోకలు గణనీయంగా పెరిగాయన్నారు!
బెంగళూరు,చిత్తూరు నుంచి చెన్నై నుంచి 24 గంటలు హైవేలో కార్లతో పాటు భారీ వాహనాలు లారీల రాకపోకలతో స్పీడు నియంత్రణ లేకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్నారు!
నేషనల్ హైవే,పోలీస్ ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు గాలిలొ కలిసిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నవీన్ డిమాండ్ చేశారు.