– విశ్వంభర డా.సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కవిగా, వైస్ చాన్సలర్‌గా , రాజ్యసభ సభ్యుడిగా నారాయణరెడ్డి ఎన్నో సేవలు అందించారు. సి. నారాయణరెడ్డి ఒక తెలంగాణకే పరిమితం కాదు. ఆయన తెలుగు జాతికి గర్వ కారణం. మారుమూల ప్రాంతం నుంచి తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు.వారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
వారు కేవలం యధాలాపంగా రచనలు చేయలేదు. ప్రతీది లీనమై రచించారు. అందుకే ఆయన రచనలను మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. సి.నారాయణ రెడ్డి జ్ఞాపకార్ధం ఏం చేయాలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైనా వారి రచనలను గ్రంథరూపం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తాం.
నంది అవార్డులంత గొప్పగా డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ఈ వేదికగా ప్రకటించా. కానీ సినీరంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గద్దర్ అవార్డుల అంశంపై సినీరంగ ప్రముఖులు ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరుతున్నా. సాహిత్య పురస్కార గ్రహీత శివశంకరి కి నా అభినందనలు.