ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు కోయంబత్తూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, ఝార్ఖండ్ గవర్నర్‌గానూ పనిచేశారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో, ఆమె స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా కూడా సేవలందించారు. *రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో ఆయనకు బలమైన అనుబంధం ఉంది.
సమతుల్యత పాటించిన కేంద్రం
భుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రాంతీయ సమతుల్యతను పాటించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము ఉత్తర భారతదేశానికి చెందినవారు కాగా, ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన రాధాకృష్ణన్‌కు కేటాయించారు. ఇది కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది.
చంద్రబాబు ఆంధ్రాకు మళ్లీ సీఎం అవ్వంగానే.. తెలంగాణా గవర్నర్ గా వున్న సిపి రాధాకృష్ణన్ స్వయంగా ఉండవల్లి నివాసంలో ఆయన్ను కలిసి చర్చించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తరువాత మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం చంద్రబాబు హాజరై ఆయన్ను కలవడం జరిగింది.