Suryaa.co.in

Andhra Pradesh

సామాన్యుడి ముంగిట్లో క్యాబినెట్ సడేమియా..!

మెరిసేదంతా బంగారం కాదు
కనిపించేది ‘క్యా’బినెట్టా…
అదో గుట్టా..కనికట్టా..
రెండున్నరేళ్లు దాటి మూడేళ్లకు చేరువులో
ఒట్టు తీసి గట్టా…!?

క్యాబినెట్ అనగా..
జ’గన్’ నుంచి వెలువడి..
స’జ్జల’ములలో జలకమాడి
‘విజయ’ సాయమై..
సంక్షేమం తృణప్రాయమై..
అభివృద్ధి మాయమై..!

అయినా..నీకు నాకు అవసరమా..
ఈ క్యాబినెట్ కూర్పు..
అదేమైనా మన జాతకం మార్పా..
ఇచ్చేసావుగా మూడేళ్ళకు
మునుపే తీర్పు..!

ఎవరికి ఉద్వాసన..
ఎవరికి ఛాన్స్..
కొన్నాళ్లుగా ఇదే చర్చ..
జగనన్న ముసాయిదా..
ఓ సామాన్యుడా..
నీకేంటి ఫాయిదా..!?
నీకెన్ని సమస్యలు..
పన్ను పోటు..కరెంటు కాటు..
జీతాలకు లోటు..ధరల వేటు
గిర్రున తిరుగుతుంటే
వైసిపి ఫ్యాను..
నీ ఇంట కరెంటు లేక
ఆగింది అదే ఫ్యాను..
పొద్దున లేస్తే టెన్షన్…
పొద్దు పొడిచి
కరెంటు పోతుందేమోనని
అటెన్షన్..
నిద్ర లేని రాత్రులు..
దినం గడవని కాలం..
ఇదే అసలైన కలికాలం..
సర్కారు జాలం..
పేదోడి బ్రతుకుపై జులుం..
ఇన్ని కష్టాలతో సస్తుంటే
నీకెందుకోయ్ క్యాబినెట్ సంధి మంత్రం..!
ఇంతకు మునుపు పొడిచిందేంటి..
ఇకపై పొడిచేదెంత..
పళ్ళు రాలగొట్టేందుకు
కొత్త రాయి..
జగనన్న కీర్తికిరీటంలో
మరో కలికితురాయి!

ఈఎస్కే…

LEAVE A RESPONSE