Suryaa.co.in

Andhra Pradesh

బెజవాడలో కేబుల్ మాఫియా

-జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కేబుల్ రంగంలో కొంతమంది మాఫియాగా ఏర్పడి కేబుల్ రంగాన్ని నియంత్రిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని , మాటవినని కేబుల్ ఆపరేటర్లను మానసికంగానూ వేధిస్తూ కేబుల్ వైర్ లను కట్ చేస్తున్నారని , వైర్లు కట్ అయితే వాటిని జాయింట్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నారని , మళ్లీ‌ బాధితుల మీదే ఎదురు పోలీస్ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అధికార పార్టీ కార్పొరేటర్ భర్త పెదబాబు ఆవేదనతో అధికార పార్టీ నేతల ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని దీనికి పెదబాబు విడుదల చేసిన వీడియోనే ఇందుకు సాక్ష్యం . ఒక కార్పొరేటర్ భర్త కే వేధింపులు ఉంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో నని ,ఇష్టానుసారంగా నెట్వర్క్ మార్చుకుంటూ ఇబ్బందులు పెట్టడం సమంజసమకాదుఅని ,ప్రతిసారి సెటప్ బాక్స్ లు మార్చాలని ఒత్తిడి చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీను అండదండలతోనే..
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  అండతోనే కేబుల్ మాఫియా రెచ్చిపోతుందని , స్థానిక నాయకులు అండదండలతోనే ఈ వేధింపులు ఉన్నాయని కార్పొరేటర్ భర్త చెప్పారని , అంటే ఈ కేబుల్ మాఫీ వెనక వెల్లంపల్లి శ్రీను ఉన్నారని అర్థమవుతుంది. కేబుల్ మాఫియా ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ప్రచారం జరుగుతోందని, తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఘటనపై మంత్రి  స్పందించాలి.

రెండు దశాబ్దాలుగా కేబుల్ రంగంపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారని…గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులు కొత్తగా ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నారని , మున్సిపల్ కార్పొరేషన్ మరియు విద్యుత్ శాఖ వారు పోల్ టాక్స్ లు ఎవరెవరు కడుతున్నారో అధికారులు దృష్టి సారించాలి . నష్టాల్లో ఉన్న కార్పొరేషన్ కు ఆదాయాన్నిచ్చే మార్గాల్లో కేబుల్ కూడా ఒకటి అని , పార్టీలతో సంబంధం లేకుండా అన్ని కేబుల్ సంస్థల నుంచి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ,పన్ను చెల్లించని ఆపరేటర్ల కేబుల్ వైర్లు తొలగించాలని , పెదబాబు కు జనసేన పార్టీ అండగా ఉంటుందని మీరు ఎటువంటి పోరాటం చేసిన దానికి ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ఇస్తామని,బెదిరింపులుపై పోలీసులు శాఖ వారు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE