Suryaa.co.in

Andhra Pradesh

ఎంపీ ఆదాల ఆశీస్సుల కోసం వచ్చా

– మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

పార్టీలోని సీనియర్ల ఆశీస్సులు తీసుకోవాలని భావించానని, అందులో భాగంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వచ్చానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన మంత్రికి ఎంపీ ఆదాల ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఎంపీగా ఆదాల అనుభవం అపారమని, జిల్లా అభివృద్ధికి ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఆయన సహాయ సహకారాలు కావాలని కోరారు.

జిల్లా కు అభివృద్ధి: ఆదాల
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి సౌమ్యుడు, స్నేహశీలి, అందరినీ కలుపుకొని పోగల సత్తా కలిగిన వ్యక్తి అని కొనియాడారు. జడ్పీ చైర్మన్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, జిల్లాపై ఆయనకు మంచి అవగాహన ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి పథంలో వెళుతుందని విశ్వాసం ఉందన్నారు. ఆయనకు అందరం సహకరిస్తామని, వెంట ఉంటామని చెప్పారు. మిగతావాళ్లు కూడా కలిసి వస్తారనే పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ,కోటేశ్వర్ రెడ్డి, డాక్టర్ సునీల్, పాముల హరి ప్రసాద్, నిజాముద్దీన్, నరసింహారావు, ఇక్బాల్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

LEAVE A RESPONSE