– సబ్ ప్లాన్ నిధులు-సాటిలేని ఉపకారవేతనాల పేరుతో తప్పుడు కథనాలు రాస్తారా?
• సబ్ ప్లాన్ ఏమిటి.. కేంద్రగణాంగాల్లో అగ్రస్థానం ఏమిటనే ఇంగితజ్ఞానం ముఖ్యమంత్రికి లేదు.. కనీసం అధికారులకైనా ఉండదా?
• ఎస్సీ సబ్ ప్లాన్ కేంద్రగణాంకాల్లో అగ్రస్థానం – సాటిలేని ఉపకారం పేరుతో తప్పుడు వార్తలు రాయడానికి సాక్షిమీడియాకు సిగ్గులేదా? రాసేవారికి సిగ్గులేకపోయినా, ప్రభుత్వానికి అయినా ఉండాలిగా!
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
ఎస్సీసబ్ ప్లాన్ కేంద్రగణాంకాల్లో అగ్రస్థానం – సాటిలేని ఉపకారం పేరుతో తప్పుడు వార్తలు రాయడానికి జగన్ సొంతమీడియా సాక్షికి సిగ్గులేకపోయినా, అధికారులకు మంత్రులు కూడా ఇంగితం లేకుండా ప్రవర్తించడం ఏమిటని, 4ఏళ్లలో దళితజాతికి జగన్ రెడ్డి చేసిన ద్రోహం వైసీపీలోని దళితమంత్రులు, ప్రజాప్రతినిధులకు కనిపించడంలేదా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …దళితులకు జగన్ చేస్తున్న వంచన, ద్రోహాన్ని కప్పిపుచ్చడానికే సబ్ ప్లాన్ నిధులు-సాటిలేని ఉపకారవేతనాల పేరుతో ప్రభుత్వం తప్పుడురాతలు రాయిస్తోంది. “దళితులకు జగన్ రెడ్డి చేస్తున్న వంచన, ద్రోహాన్ని మా సోదరులు గ్రహించారు. వారు ఆగ్రహిస్తే తమఉనికికే ప్రమాదమని గ్రహించిన ప్రభుత్వం, సొంతమీడియాలో అసత్యాలు ప్రచారంచేస్తూ, వారిలో విషబీజాలు నాటాలని ప్రయత్నిస్తోంది.
ఎస్సీ సబ్ ప్లాన్ కేంద్ర గణాం కాల్లో అగ్రస్థానం-సాటిలేని ఉపకారం పేరుతో తప్పుడు వార్తలు రాయడానికి సాక్షిమీడియాకు సిగ్గులేదా? రాసేవారికి సిగ్గులేకపోయినా, ప్రభుత్వానికి అయినా ఉండాలిగా! సబ్ ప్లాన్ ఏమి టి.. కేంద్రగణాంగాల్లో అగ్రస్థానం ఏమిటనే ఇంగితజ్ఞానం ముఖ్యమంత్రికి లేదు.. కనీసం అధికా రులకు అయినా ఉండాలిగా! 29 రిజర్వడ్ నియోజకవర్గాలుంటే, 27స్థానాల్లో వైసీపీ వారే గెలిచారు. వారిలో 5గురు దళితమంత్రులున్నారు. వారెవరైనా సరే నాతో బహిరంగ చర్చకు వచ్చి, ఈప్రభుత్వంలో సబ్ ప్లాన్ అమలవుతోంది.. దళితులకు ఈ ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి, ఈవిధమైన మేలుచేసిందని చెప్పగలరా? నిజంగా వారికి నీతినిజాయితీలుంటే, దళిత జాతికి జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహంపై బహిరంగ చర్చకు రావాలి. సబ్ ప్లాన్ – ఉపకార వేతనా ల కథనంపై సాంఘిక సంక్షేమశాఖా మంత్రి సమాధానం చెప్పాలి.
టీడీపీప్రభుత్వం దళితులకు అమలుచేసిన 27పథకాలు రద్దుచేయడం.. ఎస్సీసబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించడమేనా జగన్ రెడ్డి దళితులకు చేసిన మేలు?
నిన్నగాక మొన్న ఎస్సీకార్పొరేషన్ నిధులు రూ.7వేలకోట్లని నవరత్నాలకు మళ్లించారు.. దానిపై హైకోర్టు చీవాట్లుపెట్టినా సిగ్గులేదు. 2003లోనే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లించడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీడీపీప్రభుత్వం దళితులకు అమలుచేసిన 27 సంక్షేమపథకాల్ని జగన్ రాగానే రద్దుచేశాడు. కేంద్రప్రభుత్వం దళితులకు అమలుచేసే ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ పథకాల్ని కూడా రద్దుచేశారు. కేంద్రం దళితసంక్షేమానికి రుణాలిస్తుంటే, రాష్ట్రప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీగా ఉండలేదా?
దళితులకోసం జగన్ రెడ్డి ఆమాత్రం చేయలేడా? అదే బ్యాంకులు, ఇతరత్రా మార్గాల్లో అయిన కాడికి అప్పులు తీసుకొచ్చి, దళితులపై భారం వేయడానికి మాత్రం జగన్ రెడ్డి ముందుంటా డు. 2014-15 ఆర్థికసంవత్సరంలో రూ.4,576కోట్లు సబ్ ప్లాన్ నిధులు కేటాయిం చాము. 2018-19 నాటికి ఆ మొత్తాన్ని రూ.11,228కోట్లకు పెంచాము. టీడీపీప్రభుత్వం దాదాపు 150శాతం నిధులు పెంచి, సాధారణంగా అమలయ్యేవి కాకుండా, 27 పథకాలు ప్రత్యేకంగా దళితులకు అమలుచేసింది. ప్రతి 6నెలలకు ఒకసారి దళిత పథకాల అమలుపై చంద్రబాబు సమీక్ష చేసేవారు.
సబ్ ప్లాన్ నిధుల్లో రూ.4,900కోట్లతో దళితవాడల్లో 6వేల కిలోమీటర్ల సీసీరోడ్లు వేశాము. దళితవాడల్లో డ్రైనేజీల నిర్మాణంతోపాటు, తాగునీటి సమస్య లేకుండా వాటర్ ట్యాంకులు ఏర్పాటుచేశాము. వ్యవసాయం చేసే దళితసోదరులకు ఇతర వర్గాల రైతులకంటే మిన్నగా యంత్రాలు, యంత్రపరికరాలపై అదనంగా 90శాతం వరకు సబ్సిడీలు అందించాము. కేంద్రప్రభుత్వమిచ్చే దానితో పనిలేకుండా, హౌసింగ్ స్కీమ్ లో టీడీ పీ ప్రభుత్వం అదనంగా ఒక్కో దళితకుటుంబానికి రూ.50వేలు ఇచ్చింది. నేడు జగన్ రెడ్డి కేంద్రమిచ్చే రూ.లక్షా80వేలతో సరిపెట్టి, దళితులనోట్లో మట్టికొడుతున్నాడు.
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, అంబేద్కర్ స్టడీసర్కిళ్లు, అంబేద్కర్ విదేశీవిద్య.. ఏమయ్యాయి జగన్ రెడ్డి?
మూడున్నరేళ్లలో కేంద్రంనుంచి సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి ఎస్సీఎస్టీలకు ఉపకార వేతనాలకు రూ.4,500కోట్లు వచ్చాయి. దానిలో రూ.2,000కోట్లు సబ్ ప్లాన్ కింద వాడాలి. ఆ నిదుల్ని కూడా జగన్ రెడ్డి దారిమళ్లించాడు. దళితవిద్యార్థులకు గతంలో అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను, ఏపీ స్టడీ సర్కిళ్లు, అంబేద్కర్ స్టడీ సర్కిళ్లు, విదేశీవిద్యను ఈ ప్రభుత్వం రద్దుచేసింది. దళితవిద్యార్థులకు ఎప్పటినుంచో అందుతున్న ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్స్ ను దారిమళ్లించి, అమ్మఒడి కింద చేర్చారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ను విద్యా దీవెన అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము తల్లులఖాతాల్లో పడటంతో, కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బందిపెడుతున్నాయి. 1వతరగతి నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు దళితులకు స్కాలర్ షిప్ లు ఇచ్చేవి.
జీవోనెం-77 తో పీజీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. కాదని చెప్పగల దమ్ము, ధైర్యం ఏ దళిత మంత్రికైనా ఉందా? ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంకాదు… మనజాతికి జగన్ చేస్తున్న వంచనపై ఆలోచించమంటున్నా. ఎస్సీ రైతులకు చంద్రబాబు ఇచ్చిన 11వేల ఎకరాల భూమిని జగన్ రెడ్డి, ఇళ్లస్థలాల పేరుతో వారినుంచి బలవంతంగా లాక్కున్నాడు. ఇలా జగన్ రెడ్డి పాలనంతా దళితులదోపిడీనే లక్ష్యంగా సాగుతోంది. ముఖ్యమంత్రి దళిత జాతికి చేస్తున్న మోసంపై ఆయావర్గాల ప్రజాప్రతినిధులు మనసుతో ఆలోచించి, విజ్ఞతతో వ్యవహరించాలి” అని ఆనంద్ బాబు హితవుపలికారు.