-శంషాబాద్ విమానాశ్రయంలో నిన్ను దిగనివ్వం జాగ్రత్త
-మంత్రి బొత్స సత్యనారాయణ పై మండిపడ్డ ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రం పై బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం పై మాట్లాడినప్పుడు కొంచం అయిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బొత్స సత్యనారాయణ.
మీరు మొగోళ్ళు అయితే వారాంతంకు హైదరాబాద్ రాకుండా ఉంటారా…. మీకు చీము నెత్తురు ఉంటే మీ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉందో చెప్తారా…ఆ దమ్ముందా నీకు.
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై దండయాత్ర చేసి దోచుకున్నది మీరు,మా ప్రాంతంలో ఉన్న వనరులను దోచుకున్నది మీరు. తెలంగాణ రాష్ట్రం పై మాట్లాడే నైతిక హక్కు లేదు.
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పి ఎస్ సి ని చీ పిపి ఎస్సి అని మీడియా ,వార్త పత్రికలు రాసిన వార్తలు మర్చిపోయావా? మీరు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో నువ్వు మంత్రివి. ఎన్ని గురుకుల పాఠశాలలు ఉండే, ఎన్ని డిగ్రీ కాలేజ్ లు ఉండే…మీ పాలన లో 60 ఏండ్ల కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు ఎందుకు మరి?
మీరు రాజకీయ విమర్శలు చేస్తే మీ ఆంధ్ర రాష్ట్రంలో చేస్కో కానీ తెలంగాణ గురించి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నీవు ఇలానే మాట్లాడితే నిన్ను హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో నిన్ను దిగనివ్వం జాగ్రత్త. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పిఎస్సి గబ్బు గబ్బు అంటూ నాడు వార్త పత్రికలు వార్తలు రాశాయి. తెలంగాణ సమాజం పైన సీఎం కేసీఆర్ పైన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు జాగ్రత్త బిడ్డా బొత్స సత్యనారాయణ.
ఏపీ ప్రభుత్వం లో ఇంజనీరింగ్ విద్య బాగాలేదని, తెలంగాణ రాష్ట్రం లో ఇంజనీరింగ్ విద్య కోసం ఇక్కడకు ఏపీ విద్యార్థులు 80 వేల మంది ఇక్కడ చదువుతున్నారు.మీకు ఇప్పటికి రాజధాని దిక్కు లేదు. అందుకే తెలంగాణ వైపు మీ రాష్ట్ర విద్యార్థులు వస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్
బట్టేబాజ్ అల్ ఇండియా సంఘంకు ఎంపీ అరవింద్ ను జాతీయ అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది. ఎన్నికల ముందు పసుపు బోర్డ్ ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిన వ్యక్తి అరవింద్ ఇప్పటికి పసుపు బోర్డ్ దిక్కు లేదు నిజామాబాద్ ప్రజలకు నీవు ఎంపీ అయ్యి ఏం చేశావ్?
మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి.ఏది పసుపు బోర్డ్ అందుకే వాన్ని బట్టేబాజ్ అంటారు వాన్ని ఆ సంఘం కు జాతీయ అధ్యక్షుడు చేయాలని అంటున్న. దేశంలో 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చారు. ఒక్కటి అయిన తెలంగాణ రాష్ట్రం కు,నిజామాబాద్ కు కావాలని ఆడిగినవా. …ఎందుకు అడగలేదు?
రోడ్ల మీద తిరిగే బ్రోకర్ టికెట్ ఇస్తే యాక్సిడెంటల్ గా ఎంపీ వి అయ్యావు తప్ప, నీవు గెలిసేసత్తా లేని వ్యక్తి వి నీవు. హరిశ్ రావు మీద మాట్లాడే వ్యక్తివా నివా….అంత దమ్ము ఉందా?
హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరికిచ్చి కొడుతారు ఒళ్ళు జాగ్రత్త బిడ్డా అరవింద్. నాడు నేను పోను బిడ్డా సర్కర్ దవాఖానకు అనే సామెత నుండి నేను సర్కారు దవాఖానకు పోత అనే దగ్గరకు వచ్చింది తెలంగాణ. వైద్య రంగంకు ఎంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ పై పిచ్చి పిచ్చి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త