Suryaa.co.in

Telangana

ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముస్లింలకు 4శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ, అమిత్ షా వల్ల కాదు..

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత మాది. మైనారిటీ స్కూళ్లకు, రెసిడెన్షియల్స్ భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది.. అన్ని రంగాల్లో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్నాం.

LEAVE A RESPONSE