Suryaa.co.in

Telangana

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

– ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం పై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తు పై లేదా?
– రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ
– మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?పది రోజులు కాకముందే నేడు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన దుస్థితి.

సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పోవడం దుర్మార్గం. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి.మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి?

LEAVE A RESPONSE