Suryaa.co.in

Telangana

దోషులను వదిలిపెట్టి జర్నలిస్టులపై కేసులా..?

ప్రశాంతమైన భాగ్యనగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రవాదులు ఉన్నారని.. నగరంలోని మల్లేపల్లి కి చెందిన ఖాజా బాసిత్ షరీఫ్ అనే వ్యక్తి అందుకు సాక్ష్యం అని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. హిందూ ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేలా మాట్లాడటం.. వీడియోలు క్రియేట్ చేయడంతో పాటు రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని విమర్శించింది.

శనివారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ కార్యదర్శి వీరేష్, భరత్ వంశీ, అనిల్, ధీరజ్ లు విలేకరులతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి మందిరాన్ని, అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని కూల్చివేస్తానని వీడియోలు విడుదల చేస్తున్న కూడా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అత్యంత భయంకరమైన ఉగ్రవాదులు యాకూబ్ మెమన్, అఫ్జల్ గురులకు భారతరత్న ఇచ్చి సత్కరించాలని ఖాజా బాసిత్ షరీఫ్ డిమాండ్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

భాగ్యనగర్ లోని ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి విక్టోరియా ప్లే గ్రౌండ్స్ మధ్యలో ఉన్న హిందూ మందిరాలను కూల్చి వేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఇలాంటివి అనేక వీడియోలు చేస్తున్నా.. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం దేనికి సంకేతము చెప్పాలని విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయాలను ఓ విలేఖరి బయట పెట్టడంతో పోలీసులు విలేకరిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.

ఏప్రిల్ 26వ తేదీన షరీఫ్ వివాదాస్పదంగా విడుదల చేసిన వీడియోలను నగర కమిషనర్ గారికి మహేష్ ఉపాధ్యాయని రిపోర్టర్ షేర్ చేశాడు. దీంతో ఖాజా బాసిత్ షరీఫ్ పై కేసు నమోదు చేస్తూ A-1 గా, జర్నలిస్టు మహేష్ ఉపాధ్యాయ పై A-2 గా కేసు నమోదు చేయడం సరికాదు అన్నారు. మహేష్ ఉపాధ్యాయ పై కేసు ఎత్తివేసి, రెచ్చగొట్టే వీడియోలు చేసిన షరీఫ్ ను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE