•సామాజిక న్యాయానికి తిలోదకాలిస్తూ, నాఇష్టం.. నారాజ్యమన్నట్లుగా తనవర్గం వారికే బంగారుపళెంలో పెడుతూ, ఇతరవర్గాలను విస్మరిస్తున్న ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు తిలోదకాలు ఇవ్వడంఖాయం
• రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకకవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి తక్షణమే అత్యవసరచికిత్సచేయాలి. ఈ ప్రభుత్వ మానసిక అంగవైకల్యానికి గవర్నరే అత్యవసర చికిత్స చేయాలి
• కొత్తజిల్లాలకు కలెక్టర్ల నియామకంలో ఒక్క ఎస్సీ(మాదిగ) కులస్తుడిని కూడా నియమించకపోవడం ఆ కులాన్ని అవమానించినట్టే
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మానసికవైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని, లౌకికవాద భారతదేశంలో అన్నికులాలు, మతాలు,ప్రాంతాలను సమానంగా చూడటం అనేది రాజ్యాంగధ్యేయమని, కానీ ఈ ప్రభుత్వం ఆ మూలసూత్రాన్ని విస్మరించి, సామాజిక న్యాయానికి తిలోదకాలిచ్చిందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య అభిప్రాయపడ్డారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
పరిపాలన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలికానీ…నా ఇష్టం నాకేంటి…నన్నెవరు అడిగేది అన్నవిధంగా ఉండకూడదు. తిరుపతిలో సామాజికన్యాయం అనేది నిప్పుల్లో కలిసిపోయింది. ముఖ్యమంత్రి వీటిపై ఆలోచిస్తున్నారో…కావాలనిచేస్తున్నా రో తెలియడంలేదు. రాష్ట్రంలో సామాజికన్యాయం ఎక్కడుందని నేను ప్రశ్నిస్తున్నాను.
తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి (ముఖ్యమంత్రికి దగ్గరి బంధువు) టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, జేఈవో ధర్మారెడ్డి, సిమ్స్ డైరెక్టర్ వెంగమ్మ రెడ్డి అయితే, బర్డ్స్ డైరెక్టర్ డా.మదన్ మోహన్ రెడ్డి…శ్రీ వేంకటేశ్వరయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి, పద్మావతి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జమునారెడ్డి, తిరుపతి ఆర్డీవో కనకనర్సారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలకసంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, తుడాఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పద్మనాభరెడ్డి, ఎస్ వీ యూనివర్శిటీ రెక్టార్ శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి విజిలెన్స్ ఎస్పీ ఈశ్వర్ రెడ్డి, ఏపీ ఎస్ పీడీసీఎల్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఓబులకొండారెడ్డి ఇలా 18మంది రెడ్లను తిరుపతిపట్టణంలో దింపారు.
ఇంతమంది రెడ్లను ఒకేసారి తిరుపతి పట్టణంలో దించారేమిటి ముఖ్యమంత్రి? ప్రజలు ఏమైనా అనుకుంటారనిగానీ, రాజ్యాంగాన్ని ఖాతరుచేయాలన్న ఆలోచనగానీ ముఖ్యమంత్రి కి లేదా? ఇదేనా లౌకికపరిపాలన అంటే? తాను రెడ్లందరికీ బంగారుపళ్లెంలో పెడుతున్నాడ ని నేను అనడంలేదు. పాలెగాళ్లకు పట్టంకడుతున్నాడని చెబుతున్నాను. ముఖ్యమంత్రి చర్యలతో ఈప్రభుత్వం లౌకికవాదానికి తూట్లు పొడిచిందంటున్నా.
చీఫ్ సెక్రటరీ, డీజీపీకూడా ముఖ్యమంత్రికి ఇలాంటి నియామకాలపై చెప్పాలి కదా!
ఇదే ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షనేతగాఉన్నప్పుడు ఐదుగురు కమ్మవర్గానికిచెందిన సర్కిల్ ఇన్ స్పెక్టర్లను డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే, 33మందికి డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చా రని గగ్గోలుపెట్టాడు. దానిపై ఈప్రభుత్వంలో స్వయంగా హోంమంత్రి సుచరిత గారే కమ్మవారికి ప్రమోషన్లు ఇవ్వలేదని, కేవలం నలుగురికి మాత్రమే ఇచ్చారని అసెంబ్లీలోనే సమాధానం చెప్పింది.
తిరుపతిలోనే కాదు..రాష్ట్రమంతా కూడా ముఖ్యమంత్రి తనసామాజికవర్గానికే అగ్ర తాంబూలం ఇస్తున్నాడు.ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన అతిగొప్ప హైందవదేవాలయం ఉన్న తిరుపతిపట్టణంలో ఈ రెడ్లప్రాబల్యం ఏమిటి ముఖ్యమంత్రిగారు? కలెక్టర్ ది ఒకకులమైతే.. ఎస్పీని కూడా అదేకులం వ్యక్తిని నియమిస్తారా..చిన్నపిల్లాడిని అడిగినా దానికి ఒప్పుకోడు. కామన్ ఆలోచన అది.
కొత్త జిల్లాలకు జాయిట్ కలెక్టర్ల నియామకంలో ఒకఎస్సీ (మాదిగ) వర్గానికిచెందిన అధికారి కూడా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దొరకలేదా? 26 జిల్లాలకు నియమించిన కలెక్టర్లలో ముఖ్యమంత్రి సీనియారిటీని విస్మరించారు. 2013 బ్యాచ్ కు చెందిన, సీనియారిటీలో ముందున్న మాదిగకులానికి చెందిన పీ.రాజబాబు కలెక్టర్ గా ఈప్రభుత్వానికి పనికిరాలేదా?
మాదిగకులస్తులను కలెక్టర్లుగా నియమించడానికి ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు…ఎందుకు వెనకడుగువేస్తున్నారు? 2013లో బ్యాచ్ అధికారిఅయిన రాజబాబుని ఎందుకు విస్మరించారో… 2014లో వచ్చిన మాధవీలతారెడ్డికి కలెక్టర్ గా ఎందుకు పోస్టింగ్ ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి? ఇదేవిధంగా ముఖ్యమంత్రి సామాజికన్యాయానికి తిలోదకాలు ఇస్తే, ప్రజలు ఆయనకు తిలోదకాలు ఇవ్వడంఖాయం. లౌకికవాదానికి విరుద్దంగా జరిగిన అధికారులనియామకాలను చీఫ్ సెక్రటరీ, డీజీపీలు తక్షణమే సమీక్షించి రెక్టిఫై చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.
చంద్రబాబు హయాంలో పోలీస్ అధికారుల ప్రమోషన్లలో 5గురు కమ్మవారికి డీఎస్పీలుగా పదోన్నతి ఇస్తే 33మందికి ఇచ్చారని గగ్గోలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేం సమాధానంచెబుతార ని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇదేవిధంగా రెడ్డివర్గాన్ని అందలంఎక్కించాలనిచూస్తే , అంతిమంగా ఆ వర్గమే ఇబ్బందిపడుతుందని చెబుతున్నాను. ఏదో ఒక జిల్లాలో ఎస్సీ (మాదిగ) వర్గానికి చెందిన సీనియర్ అధికారికి కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రికి ఎందుకు మనసురాలేదని ప్రశ్నిస్తున్నాం. దళితవర్గంఓట్లు దండుకునేకదా… జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది. ముఖ్యమంత్రి చర్యలను ఎవరూ హర్షించడం లేదు.