– జాతీయ ట్రైబల్ కమీషన్ లో పిర్యాదు చేసిన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
జగన్ మోహన్ రెడ్డి పాలనలో కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతోంది.ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన పత్రికా సమావేశం గిరిజన మహిళపై కులవివక్షకు పాల్పడ్డారు. యానాది కులానికి చెందిన ఆత్మకూరు మునిసిపాలిటీ చెర్మన్ వెంకటరమణమ్మను పత్రికా సమావేశంలో నిలబెట్టి అవమానించారు.
ఆత్మకూరుకు ప్రధమ మహిళ వెంకటరమణమ్మను గిరిజన మహిళ అయినందుకే ఎమ్మెల్యేలతో సమానంగా గౌరవించలేదు. గిరిజన మహిళను నిలబెట్టి అవమానించడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ -3 ప్రకారం శిక్షార్హం.శాసనసభ సభ్యుడిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించడం దారుణం.
పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వారిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించండి. సామాజికంగా వెనుకబడిన అణగారిన వర్గాల వారి హక్కులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోండి.