Suryaa.co.in

Andhra Pradesh

సీబీఐ .. గూగుల్‌ టేక్‌ఔట్‌

దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ‘గూగుల్‌ టేక్‌ఔట్‌’ సమాచారాన్నీ ఉపయోగించారు. దీనికోసం ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (సీఎ్‌ఫఎ్‌సఎల్‌)ని సంప్రదించారు. తమ గూగుల్‌ అకౌంట్‌ ద్వారా చేసిన ఏ పనులకు సంబంధించిన డేటానైనా ‘టేకౌట్‌’ ద్వారా తెలుసుకోవచ్చు. మరీముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి లొకేషన్‌ హిస్టరీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ప్రకారం… గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి (దేవిరెడ్డి శంకర్‌ రెడ్డికి సన్నిహితుడు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున బస్టాండు-వివేకా ఇంటి మధ్య తిరిగినట్లు సీబీఐ గుర్తించింది.) మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ ఆరోజు ఉదయం 6.25 గంటలకు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఇంటి వద్ద ఉంది. ఆ తర్వాత రెండు నిమిషాలకే వివేకానందరెడ్డి ఇంటి బయట కనిపించింది. 6.29 నుంచి 6.31 వరకు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి.. వివేకా ఇంటి లోపలే ఉన్నాడు.

LEAVE A RESPONSE