Suryaa.co.in

Andhra Pradesh

కుప్పం హోటల్ పై దాడి ఘటనపై చంద్రబాబు ట్వీట్

కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం.

ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం…హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE