Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా బహుళార్థక సాధక ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై లేఖ లో వివరంగా పేర్కొన్న చంద్రబాబు.

ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరిన చంద్రబాబు
పోలవరం పై కేంద్రం, PPA రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం ఎలా పెడచెవిన పెట్టి నష్టం చేసిందో అంశాల వారీగా వివరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు.

లేఖలో చంద్రబాబు పేర్కొన్న అంశాలు:-
•2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదాతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది.
•2014లో కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఎపికి బదిలీ చేయడం ప్రాజెక్టుకు మేలు జరిగింది.
•నీతి-అయోగ్ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అద్భుతమైన పురోగతిని నమోదు చేయడంలో ఎంతో సహాయపడింది.
•పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి. నదుల అనుసంధానానికి ఆధారం.
•కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని టీడీపీ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 71 శాతం పూర్తి చేసింది.
•ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తన ఉద్దేశ్య పూర్వక, అసమర్థ నిర్ణయాల ద్వారా పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టింది.
•ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో కలవరపెడుతున్న పరిణామాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.
•ఈ పరిణామాలను పరిష్కరించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
•ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంది.
•ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేతృత్వంలోని అధికారం చేపట్టిన నాటి నుంచి స్వార్థ ప్రయోజనాలతో ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రాధాన్యతలతో ముందుకెళుతోంది.
•వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజే అంటే జూన్ 1, 2019 న, భారత ప్రభుత్వ సంస్థల నుండి ఆమోదం పొంది పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను మార్చాలని నిర్ణయించింది.
•రివర్స్ టెండరింగ్ పేరుతో 2019 నవంబర్ లో పనులు మరొక ఏజెన్సీకి అప్పగించారు.
•ఆకస్మికంగా పనులు నిలిపివేయడంతో టెండర్ల ప్రక్రియ ముగిసి కొత్త ఏజెన్సీ పనులు చేపట్టేందుకు ఆరు నెలల సమయం పట్టింది.
•ఈ ఆరు నెలల్లో ప్రాజెక్ట్ వద్ద ఏ ఏజెన్సీ కూడా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించలేదు.
• కాంట్రాక్టర్ ను మార్చే క్రమంలో ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టలేదు. ఈ కారణంగా డయాసఫ్రమ్ వాల్ దెబ్బతినడం జరిగింది.
•డయాఫ్రమ్ వాల్‌ను రికార్డు సమయంలో నదీగర్భం లో 40మీ నుంచి 100మీ లోతు వరకు ఒక ప్రఖ్యాత ఏజెన్సీ నిర్మించడం జరిగింది.
•పోలవరం పనులు సంతృప్తి కరంగా ఉన్న సమయంలో కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం లేదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది.
13 ఆగస్టు 2019న జరిగిన 10వ అత్యవసర సమావేశంలో పీపీఏ స్పందిస్తూ…..
•ప్రాజెక్టు పనుల్లో సంతృప్తికరమైన పురోగతి దృష్ట్యా కాంట్రాక్టు ఒప్పందాల రద్దు చేసేందుకు సరైన కారణాలు గానీ, పనులను తిరిగి టెండర్ చేసేయాల్సిన అవసరం గానీ లేదని చెప్పింది.
•ఏజెన్సీ మార్పు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక బాధ్యతను పెంచుతుందని కూడా చెప్పింది.
•ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో నిరవధిక జాప్యం అవుతుందని, ప్రాజెక్టే అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని కూడా పీపీఏ హెచ్చరించింది.
•పీపీఏ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగింది
•17 ఆగస్టు 2019న టెండర్ నోటీసును జారీ చేసింది.
•నిర్మాణం ఆలస్యం కారణంగా ప్రాజెక్టుల ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుగుదేశంపార్టీ సైతం వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
•అయినప్పటికీ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయడంలో వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు.
•వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక తప్పిదాలు, పర్యవేక్షణ లేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.
•డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని కూడా ఫిబ్రవరి 2022లో మాత్రమే ప్రకటించారు.
•డయాఫ్రమ్ వాల్‌ కొట్టుకుపోయిన సమయాన్ని వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ధారించే స్థితిలో లేనట్లు కనిపిస్తోంది.
•మరోవైపు జూన్ 2019 నుంచి ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యంతో పునరావాస ఖర్చులు పెరిగాయి.
•కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కు కేటాయించిన నిధులను నకిలీ పేర్లతో దుర్వినియోగం అయ్యాయి.
•ప్రాజెక్టు నిర్మాణం జాప్యంతో సాగునీటి సరఫరా, నదుల అనుసంధానం ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
•విద్యుత్ ప్రాజెక్టు పూర్తి కాని కారణంగా జల విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది.
•ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ఉత్తరాంధ్రకు తాగునీటిని అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంపై ప్రతికూల ప్రభావం పడగా, రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు సరఫరా పైనా ప్రభావం పడింది.
•అంతేకాకుండా, రాష్ట్రంలో నదుల అనుసంధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
•వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో ప్రాజెక్టు నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది.
•వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై అనేక ప్రకటనలు ఇచ్చింది. జాప్యం పెరగడంతో వాటిని తరుచూ మార్చింది.
•ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారు.
•తరువాత దానిని డిసెంబర్ 2021 వరకు పొడిగించారు. దానిని మరలా జూన్ 2022కి మార్చారు.
•తాజాగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేము అని ప్రకటించారు.
•పోలవరం ప్రాజెక్టు నష్టాన్ని పునరుద్ధరించేందుకు రూ. 800 కోట్ల అదనపు నిధులు అవసరం.
•నిర్మాణ జాప్యంతో దేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా అపారమైన నష్టం జరిగింది.
•ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరుగుదల, పునరావాస ఖర్చులు ప్రత్యక్షంగా భరించవలసి ఉంటుంది.
•జూన్ 2019 నుంచి పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన జాప్యం, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం చాలా అవసరం.
•సంఘటనలపై క్షుణంగా అధ్యయనం చేసి జాప్యం, తత్ఫలితంగా దేశానికి కలిగిన నష్టాన్ని ప్రజల ముందుంచాలి.
•నేను లేఖలో పేర్కొన్న లోపాలకు సంబంధించిన సాంకేతిక అంశాల వివరాల్లోకి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
•ప్రాజెక్ట్ ప్రయోజనాలను త్వరితగతిన పొందేందుకు వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి.
•ఈ విషయంలో సత్వర జోక్యంతో పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ ను కోరిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
•లేఖతో పాటు పిపిఎ మినిట్స్, కేంద్రం పలు సందర్భాల్లో చేసిన సూచనల కాపీలను కూడా జత చేసిన చంద్రబాబు

LEAVE A RESPONSE