-తల తోక లేని నిర్ణయాల వల్ల రైతుల ఇబ్బంది పడుతున్నారు.
-సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ మారింది.
-బియ్యం నూకలు ఎగుమతి పై ఎందుకు నిషేధం విధించారు
-ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్
మంత్రి హరీశ్ రావు ఏం మాట్లాడారంటే.. ఈ మార్కెట్ కమిటీకి పెద్ద హిస్టరీ ఉంది. ఎమ్మెల్యే గారు కోరగానే సీఎం గారు విలువైన 15 ఎకరాలు ఇచ్చారు. అతి త్వరలో సంగారెడ్డి వైద్య కళాశాల, పటాన్ చెరులో 300 పడకల ఆసుపత్రి కోసం శంకుస్థాపన చేస్తారు.బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందాం. సీఎం కేసీఆర్ గత పర్యటనలో ఎంతో ప్రకటించారు.పత్రికల్లో చూశాము.. కేంద్రం నూకలు ఎగుమతి మీద నిషేదం పెట్టింది. వరి ధాన్యం మీద నిషేధం పెట్టింది. ఎందుకు.?
వరి వద్దు అన్నరు. కేంద్రం కొనది అన్నరు. మేము కష్టపడి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పండించాము.దక్షిణ భారతకు తెలంగాణ ధాన్యాగారం అయ్యింది. వడ్లు కొనమని సీఎం కేసీఆర్ గారు ఢిల్లీ లో ధర్నా చేశారు. నాలుగేళ్లు నిల్వ ఉంటే ఎందుకు నిషేధం పెడుతున్నారు.మీకు తల, తోక లేదు. దశ దిశ లేదు. మంత్రి నిరంజన్ రెడ్డి డిల్లీ వెళ్లి అడిగితే, మీరే నూకలు తినాలి అని అవమానించారు. ఇప్పుడు నూకలు ఇతర దేశాలకు అయినా పంపాలి అంటే, ఇప్పుడు నిషేధం పెడుతున్నారు.
దేశంలో ఆహారం నిల్వలు తగ్గినప్పుడు నిషేధం పెడుతారు. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు. దేశ ఆహార భద్రతకు భరోసా లేకుండా చేస్తున్నారు.కేంద్రం అసంబద్ధ నిర్ణయాలు. దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీ పరిపాలన రైతులకు శాపంగా మారింది. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు ఏమైందీ. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. సగం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.ఉమ్మడి 23 జిల్లాలో 72లక్షల ఎకరాల్లో వరి పండితే, ఇప్పుడు 10 జిల్లాలో 65 లక్షల ఎకరాల్లో వరి పండింది. సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణ గా రాష్ట్రాన్ని మార్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.