Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రం 15 వేల కోట్లు ఇవ్వడం హర్షనీయం

– మంత్రి కొలుసు పార్ధసారధి   

అమరావతి : అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం 15వేల కోట్లు ఇవ్వడం హర్షనీయమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి 15వేల కోట్ల ఆర్థిక సహాయం అందించడం సంతోషదాయకం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధిక నిధులు కేటాయించడం శుభపరిణామం. పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి 72 శాతం పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేయకుండా నాశనం చేసిందన్నారు.  రాయలసీమ,ప్రకాశం,ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు.

విశాఖ-చెన్నె పారిశ్రామిక నడవా,చెన్నై-బెంగుళూర్ పారిశ్రామిక నడవాలకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాధన్యతను ఇచ్చారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిదులు కేటాయించారు. విభజన చట్టంలో ఉన్న హమీల అమలుకు నిధులు కేటాయించారు. పూర్వోదయ పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రాజెక్టు మంజూరు చేశారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట నాటకమాడి అమరావతి రాజధానిని నాశనం చేసిందని దుయ్యబట్టారు.

LEAVE A RESPONSE