-ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ల ఆవిష్కరణ
-అభ్యంతరాలు రావడంతో పునఃపరిశీలనకు డిజైన్లు
-తాజాగా విశాఖ, నెల్లూరు స్టేషన్ల డిజైన్ల విడుదల
దేశంలో రైల్వే స్టేషన్ల రూపు రేఖలను సమూలంగా మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించి… దశల వారీగా మిగిలిన రైల్వే స్టేషన్లను కూడా ఆధునీకరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లను ఆ శాఖ విడుదల చేయగా… ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని పునఃపరిశీలనకు తీసుకుంది.
తాజాగా సోమవారం విశాఖపట్నం, నెల్లూరు రైల్వే స్టేషన్లకు సంబంధించిన నూతన డిజైన్లను రైల్వే శాఖ విడుదల చేసింది. రాజకోటల మాదిరిగా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను ఆ శాఖ సేకరించనుందట. ఈ డిజైన్లను బీజేపీ ఏపీ శాఖ సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో పునఃఅభివృద్ధి చేయబోయే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, నెల్లూరు రైల్వే స్టేషన్ల ప్రతిపాదిత డిజైన్లు pic.twitter.com/hbQfW4JzD8
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 18, 2022