* గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.
* గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా చర్యలు చేపట్టింది.
* కేంద్రం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ చేసే ఆకాశం లేకుండా ప్రతి గ్రామ పంచాయితీ కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
* ఏప్రిల్ 1 నాటికి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచుల పేరిట జాయింట్ అకౌంట్ లో ఓపెన్ కాబోతున్నాయి.
* రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఫండ్స్ కేటాయిస్తుంది.
* గ్రామంలోని ప్రతి వ్యక్తికి “రూ”1760 రూపాయల చొప్పున ఎంత జనాభా ఉంటే అంత మొత్తం ఇస్తుంది.
* అయితే ఆ నిధులను గ్రామ అవసరాలకు వాడకుండా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేస్తుంది. ఇతర అవసరాల కోసం ఆ ఫ్రెండ్స్ వాడుతూ సర్పంచు లకు చుక్కలు చూపిస్తోంది.
* గ్రామ పంచాయితీ ఖాతాలో ఫండ్స్ ఉన్నా ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆఫీసులలో ఈ చెక్కులను పేమెంట్ చేయకుండా నిలిపివేశారు. అప్పుడు ఇప్పుడు అంటూ పనులు చేసిన కాంట్రాక్టర్లను చెప్పులు అరిగేలా తిప్పుకునే వారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడం తో ఈ పరిస్థితి ఉండేది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం వల్ల గ్రామాల్లో పనులు వెంటనే బిల్లు పొందే అవకాశాలు ఉన్నాయి.
* రాష్ట్ర సర్కారు తీరు కారణంగా ఫండ్స్ ఉన్నా ఇన్నాళ్లు సర్పంచులు, తిప్పలు పడాల్సి వచ్చింది ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి.
* స్థానిక సంస్థలను స్వపరిపాలన దిశగా బలోపేతం
చేయటం ద్వార గ్రామీణ భారతానికి సుపరిపాలన
అందంచటం “ఆత్మనిర్భర్ భారత్” లో ఒక లక్ష్యం!
-మల్లిన రాధాకృష్ణ,
మోది హెల్ప్ డెస్క్,
తనుకు.