Suryaa.co.in

స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్రం ప్రోత్సాహం
Andhra Pradesh

స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్రం ప్రోత్సాహం

_ ఎంపీ జీవీఎల్
గుంటూరు: నేటితరం స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు ప్రోత్సాహం అందిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. చదువుతోపాటు వృత్తి విద్యలు, స్పోర్ట్స్, సాంస్కృతిక వికాసం మనిషి మేధస్సును పెంచుతాయని వివరించారు. ఆదివారం నరసరావుపేటలో నేస్తం ట్రస్ట్ పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఒకే స్కూల్లో చదివిన విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధితో పాటు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుండటం అభినందనీయమని అన్నారు. కరోనా సమయంలో
Whats-App-Image-2021-12-05-at-18-20-27ప్రైవేటు టీచర్లకు సాయం చేయటం అభినందనీయమన్నారు. ఉన్నత స్థాయిలో కి వెళ్ళిన విద్యార్థులు, నేస్తం ట్రస్ట్ ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్, కల్చరల్ కార్యక్రమాలకు తన సహాయం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పై నేషనల్ ట్రస్ట్ దృష్టి సారించాలని సూచించారు. తన సొంత పట్టణమైన నరసరావుపేటలో సామాజిక సేవ కోసం పూర్వ విద్యార్థులు, ట్రస్టు స్థాపించడం గర్వంగా
nestam-trustఉందన్నారు. నేస్తం మేనేజింగ్ ట్రస్టీ కోటి రెడ్డి మాట్లాడుతూ, తాము ఇప్పటివరకు 60 లక్షల రూపాయల విలువైన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది రామ్మోహన్ రావు, కోటిరెడ్డి,డాక్టర్ గొంది శ్రీనివాసరావు , నూతక్కి శ్రీధర్, లంక శ్రీనివాస్, సోము వెంకటరమణ,యూ కె రమేష్, గుంటుపల్లి సుబ్రహ్మణ్యం, సుభాని తదితరులు ప్రసంగించారు.

LEAVE A RESPONSE