– యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి
భువనగిరి: చలమల కృష్ణారెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అతను కాంగ్రెస్ పార్టీలో లేరు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకుంటున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బిజెపి పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది.
బిజెపి పార్టీలో ఉండి మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలని చూశాడు, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేయాలని ప్రయత్నించాడు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రాకుండా చూడాలని ప్రయత్నించాడు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, జానా రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఇష్టమైన బూతులు తిట్టాడు. సంపాదించిన సొమ్మును కాపాడుకోవడానికి నల్ల దందాలను కాపాడుకోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోము. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోము.