Suryaa.co.in

Telangana

యరపతినేని కోసం చలో గురజాల

– హైదరాబాద్‌లోని గురజాల నియోజకవర్గ ప్రజలతో యరపతినేని ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్: గురజాల టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాసరావు విజయం కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్న గురజాల వాసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆ మేరకు హైదరాబాద్‌లో నివసిస్తున్న గురజాల వాసులతో యరపతినేని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు.. అందరికీ అందుబాటులో ఉంటూ, ఫోన్‌లో మాట్లాడినా స్పందించే యరపతినేనిని గురజాలలో గెలిపించుకోవలసిన అవసరం అందరిపైనా ఉందన్నారు. గురజాలలో మళ్లీ టీడీపీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని, టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్ధించారు.

LEAVE A RESPONSE