ప్రొద్దుటూరులో టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇతర టిడిపి నాయకుల అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రవీణ్ ఇంటిపై వైసీపీ రౌడీమూకలు దాడిచేస్తున్నారన్న సమాచారం ఉండి కూడా పోలీసులు అడ్డుకోలేదంటే రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో తెలుస్తుంది.
రౌడీల దాడి నుంచి రక్షించాల్సిన పోలీసులు, దాడి జరిగాక వచ్చి బాధితుడి మీదే అక్రమకేసు పెట్టారంటే ఏమనుకోవాలి? ప్రజల నుంచి జీతం తీసుకుంటూ వైసీపీకి ఊడిగం చేస్తున్న పోలీసుల తీరు డిపార్ట్మెంట్ కే అవమానం. ప్రవీణ్ ను, టిడిపి నేతలను వెంటనే విడుదల చేసి, దాడికి పాల్పడ్డ రౌడీలను అరెస్ట్ చేయాలి.