Suryaa.co.in

Andhra Pradesh

ఇంటర్ లో ప్రతిభ చూపిన పేద మైనారిటీ విద్యార్థినులకు చంద్రబాబు అభినందన

సత్తెనపల్లి:- ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన ఇద్దరు పేద మైనార్టీ విద్యార్థులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. నిన్న వచ్చిన ఇంటర్ 2023 ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో పఠాన్ నీలోఫర్ 983/1000 మార్కులు సాధించింది. జూనయర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో షేక్ రీనా 463/470 మార్కులు సాధించింది. పఠాన్ నీలోఫర్ తండ్రి పంక్చర్ షాప్ లో పని చేస్తుండగా, షేక్ రీనా తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు మంచి మార్కులు సాధించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారికి రూ.10 వేలు చొప్పున ప్రోత్సాహకం అందజేశారు.

LEAVE A RESPONSE