– ఏపీ శెట్టిబలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి
కాకినాడ రూరల్: గీత కులాలకు మేలు చేసింది కూటమి సీఎం చంద్రబాబే అని ఏపీ శెట్టి బలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు అన్నారు. కాకినాడ రూరల్ తూరంగిలో బుధవారం గీతకులాల ఆపద్బాంధవుడు చంద్రబాబు పేరుతో రూపొందించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడారు. చంద్రబాబు గీత కులాలకు మద్యం షాపులు, బార్లలో 10 శాతం రిజర్వేషన్లు, లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించి, ఆపద్బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. ఇందుకు కృతజ్ఞతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో 300 ట్రాక్టర్లతో తూరంగి నుంచి వేళంగి వరకూ జరిగిన అన్నదాత సుఖీభవ ర్యాలీలోను, రైతు సంబర సభలోను ఆయన పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.