– బెల్లంబట్టీ కార్మికులతో ఆరా
బొబ్బిలి నియోజవర్గం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చిరు వ్యాపారులను పలకరించారు. రాజాం నుంచి బిబ్బిలి వెళ్ళే దారిలో ఒక గ్రామం లో అరటిపళ్ళు అమ్ముకునే వ్యక్తి తో ముచ్చటించారు. స్వయం గా అరటిపళ్ళు కొనుగోలు చేసి అక్కడ ఉన్న పిల్లలకు, స్థానికులకు ఇచ్చారు. అనంతరం సమీపంలో ఉన్న బెల్లం బట్టీని పరిశీలించారు. బెల్లం తయారీ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరుకు రైతుల పంట దిగుబడులు, గిట్టుబాటు ధరలపై ఆరాతీశారు. స్థానికం ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లు మూతపడిన అంశాన్ని స్థానికులు చంద్రబాబుకు తెలిపారు.