• అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి చరిత్ర దేశమంతా తెలుసు
• జగన్ రెడ్డి ఢిల్లీస్థాయిలో లాబీయింగ్ చేసి, సాక్షి మీడియా విషప్రచారం చేస్తేనో, వైసీపీనేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు అవినీతి పరుడు కాడు
• 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ మచ్చా, ఎలాంటి అవినీతి మరక లేని ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కడే.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
అవినీతి పునాదులపై ఆవిర్భవించిన వైసీపీ, ఆపార్టీ నేతలు, జగన్ రెడ్డి వారికి అంటిన అవినీతి మకిలను ఎదుటివారికి అంటించేందుకు తాపత్రయపడుతున్నారని, 2019 ఎన్నికలకు ముందు ప్రజల్ని మాయమాటలు, అబద్ధాలతో వంచించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అండ్ కో, అదే పద్ధతిని మరలా అమలుచేస్తూ, లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ, అవినీతి మీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ సాక్షి పత్రిక.. ఛానెల్లో టీడీపీ, చంద్రబాబుపై విషప్రచారం చేయిస్తూ, జగన్ రెడ్డి అతని పార్టీవారు శునకానందం పొందుతున్నారు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ, మరక లేని ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ఏ విభాగం కేసులు అయినా ఆయనపై ఉన్నాయా అని పనికిమాలిన సాక్షి మీడియాను, జగన్ రెడ్డిని అడుగుతున్నాం.
అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి చరిత్ర, వైసీపీనేతలు, సాక్షిమీడియాకు తప్ప దేశమంతా తెలుసు
జగన్ రెడ్డి, అతని ప్రభుత్వ అవినీతి, దోపిడీని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే పద్మ విభూషణ్ వంటి పురస్కారాలు పొందిన గౌరవనీయులపై కూడా దుష్ప్రచారం చేస్తున్నా రు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి, రూ.43వేలకోట్ల ఆస్తులు ఈడీ జప్తు చేయబడిన జగన్ రెడ్డి చరిత్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అవినీతి సామ్రాట్ పేరుతో బీబీసీ మీడియా జగన్ రెడ్డి చరిత్ర తాలూకా అవినీతి లీలలు దేశమంతా తెలుసు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్ల ప్రజలసొమ్ము కొట్టేసిన జగన్ రెడ్డి ఘనతలు, కుంభకోణాలు దేశం ఎప్పటికీ మర్చిపోదు. వాన్ పిక్, లేపాక్షి భూముల కుంభకోణంలో ఎంతమంది ఐ.ఏ.ఎస్ అధికారుల్ని జగన్ జైళ్లపాలు చేశాడో అందరికీ తెలుసు. ఈ నాటికి తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తనను రక్షించాలని జగన్ రెడ్డి కేంద్రపెద్దల కాళ్లపై పడి బతిమాలుకుంటున్నది నిజంకాదా? ఇవేవీ అవినీతి నుంచి పుట్టిన సాక్షి మీడియాకు .. ప్రజలసొమ్ము దోచేస్తున్న వైసీపీనేతలకు కనిపించవా?
జగన్ రెడ్డి లాబీయింగ్ చేసి తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన చంద్రబాబు తప్పుచేసినట్టు కాదు
చంద్రబాబుకి ఐటీ విభాగం ఇచ్చిన నోటీసుల్లో ఏముందని విషపుప్రచారం చేస్తున్నారో జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా సమాధానం చెప్పాలి. ఏమీలేని దానిపై ఏదో నోటీసు ఇస్తే, దానిపై జగన్ రెడ్డి, అతని నీలిమీడియా పనిగట్టుకొని విషప్రచారం చేయడం ఏమిటి? అక్రమాలు జరిగాయని నిర్ధారించనప్పుడు కావాలనే దుష్ప్రచారం చేయడం ఏమిటి? జగన్ రెడ్డి లాబీయింగ్ చేసి ఐటీ నోటీసులిప్పించినంత మాత్రానో, అవినీతి మీడియాలో విషప్రచారం చేసినంత మాత్రానో చంద్రబాబు తప్పు చేసినట్టు కాదు.
ఐటీ విభాగం ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఇప్పటికే జవాబు ఇచ్చారు. వ్యవహారం మొత్తం సమసిపోయినా జగన్ రెడ్డి మనసు మాత్రం కుదుట పడటంలేదు.. సాక్షి మీడియా విషప్రచారం ఆగడంలేదు. గతంలో ఇలా దుష్ప్రచారం చేసే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు 6లక్షల కోట్లు కొట్టేశాడని, తప్పుడు రాతలతో పుస్తకాలు ముద్రించిన జగన్, అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి అవినీతి కూడా నిరూపించలేక చతికిలపడ్డాడు. నాలుగున్నరేళ్లుగా అధి కారంలో ఉన్న జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం టీడీపీప్రభుత్వంలో రూపాయి అవినీతి జరి గిందని నిరూపించగలిగాయా?
పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని దుష్ప్రచారం చేసిన సన్నాసులు, వారికి వంతపాడిన దోపిడీదారులు నాలుగేళ్లుగా ఏంపీకారు? అమరావతిని నాశనం చేయడానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో దుష్ప్రచారం చేస్తే న్యాయస్థానాలు చెప్పుతో కొట్టినట్టు జగన్ రెడ్డి, అతని పార్టీ వారికి సమాధానం చెప్పా యి. అయినా కుక్కతోక వంకర అన్నట్టు వీళ్ల బుద్ధులు మారలేదు. జగన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబుకి వచ్చిన ఐటీ నోటీసులపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లోజరిగిన ఐటీ సోదాలపై అసెస్ మెంట్ ఆర్డర్ బయటపెట్టడంతో ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదని ఐటీ అధికారులు చెప్పారు
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎక్కడా మచ్చుకైనా లేని అవినీతిని పట్టుకొని ఉన్నదని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్న జగన్ రెడ్డి, అతని నీలిమీడియాను ఇదివర కే టీడీపీ నిలదీసింది. ఆధారాలతో సహా ప్రజలముందు జగన్ అతని విషమీడియా దుష్ప్రచారాన్ని ఎండగడితే అప్పుడు తోకముడిచారు.
చంద్రబాబు వద్ద పీఎస్ గా పని చేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపితే, దానికి సంబంధించిన అసెస్ మెంట్ ఆర్డర్ ను కూడా అప్పుడే బయటపెట్టడంతో, ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదని ఐటీ అధికారులే చెప్పారు. ముగిసిపోయిన కథను పట్టుకొని జగన్ రెడ్డి ముక్కిమూలుగుతూ ఏదో ఉందని నమ్మించే ప్రయత్నాలు మాత్రం ఆపడంలేదు.
ప్రజల్లో తనపై పెరుగుతున్న ఈర్ష్యాద్వేషాలను కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి ..చంద్రబాబుకి ఐటీ నోటీసులని దుష్ప్రచారం మొదలెట్టాడు
చంద్రబాబు అవినీతి చేశాడని జగన్ లాంటి అవినీతిపరులు, దోపిడీదారులు చెప్పడం చూసి ప్రజలు నవ్వుతున్నారు. జగన్ రెడ్డి అవినీతిపరుల ఆటకట్టించాలనే చంద్రబాబు పెద్దనోట్లు రద్దుచేయాలని కేంద్రానికి ఎన్నోసార్లు సిఫార్సు చేశారు. జగన్ రెడ్డిలాగా చంద్రబాబు ఏనాడూ తప్పుడు పనులు చేయడమో… ప్రజలసొమ్ము కొట్టేసి జైలుకెళ్ల డమో చేయలేదు.
తనపై వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో నానాటికీ తనపై కలుగుతున్న ఈర్ష్యాద్వేషాల నుంచి వారి దృష్టి మళ్లించి, తన పబ్బం గడుపుకోవడానికే జగన్ రెడ్డి అతని అవినీతి మీడియాలో చంద్రబాబుకి ఐటీ నోటీసులంటూ విషప్రచారం చేయిస్తున్నాడు. కావాలనే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి జగన్ రెడ్డే, టీడీపీఅధినేతకు తప్పుడు నోటీసులు ఇప్పించాడు.
తప్పుడు ఆరోపణలు చేయడం.. ఆధారాలు చూపమంటే తోక ముడవడం జగన్ కు అలవాటే
చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేయడం… ఆధారాలు చూపమంటే తోక ముడవడం జగన్ రెడ్డి కుటుంబానికి అలవాటే. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే తప్పుడు ఆరోపణలు చేసి, హౌస్ కమిటీలు వేశాడు. చివరకు చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు ఆవగింజంత కూడా తేల్చలేకపోయాడు. జగన్ తల్లి విజయమ్మ కూడా చంద్రబాబు అవినీతి చేశాడని కోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కు తీసుకుంది.
అదీ చంద్ర బాబు నాయుడి వ్యక్తిత్తం. నిప్పులాంటి చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడం… విషప్రచారం చేయడం తప్ప.. ఆధారాలతో నిరూపించడం జగన్ రెడ్డి కాదు కదా… ఎవరి వల్లా కాదు. అవినీతి సొమ్ముతో మీడియాసంస్థలు స్థాపించి, అదే సొమ్ముతో వైసీపీ పెట్టి, చంద్రబాబుపై విషప్రచారం చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదు.
24 గంటలూ.. చంద్రబాబు, టీడీపీపై దుష్ప్రచారం తప్ప సాక్షి మీడియాకు మరోపనిలేదు
అవినీతి మీడియా సాక్షికి జగన్ రెడ్డి అవినీతి, దోపిడీ, అతనిపై ఉన్న కేసులు, వాటిం నుంచి బయటపడటానికి ఢిల్లీ పెద్దలతో చేస్తున్న లాబీయింగ్ లు కనిపించవు.. వాటిపై ప్రజలకు వాస్తవాలు చెప్పే దమ్ము, ధైర్యం కూడా అవినీతి మీడియాకు లేదు. 24 గంటలూచంద్రబాబుపై, టీడీపీపై దుష్ప్రచారం చేయడం తప్ప సాక్షి మీడియాకు, జగన్ రెడ్డికి, అతని పార్టీకి మరో పని లేకుండా పోయింది. అధికారమిచ్చిన ప్రజల కష్టాలు.. వారి సమస్యలపై స్పందించే ధైర్యం సాక్షి మీడియాకు లేదు.
సాక్షికి వత్తాసుగా, జగన్ రెడ్డికి వంతపాడుతూ బ్లూమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. చంద్ర బాబుకి వచ్చిన ఐటీ నోటీసులకు ఎలాంటి విలువలేదు. మచ్చలేని నాయకుడైన చంద్ర బాబుపై, ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లాలనుకోవడం ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందనే వాస్తవాన్ని వైసీపీనేతలు, సాక్షి మీడియా తెలుసుకుంటే మంచిది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే సత్యం చంద్రబాబు విషయంలో ఎప్పటికీ రుజువు అవు తూనే ఉంటుంది.” అని బొండా ఉమా స్పష్టంచేశారు.