Suryaa.co.in

Andhra Pradesh Telangana

చంద్రబాబు తెలంగాణలో, ఆంధ్రలో ఫెయిల్

– పొద్దు పోక మళ్లీ బిజెపితో కలిసి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడు
– చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ మీద.. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ను ఆంధ్ర టిడిపి అధ్యక్షుడిని చేసి, ముఖ్యమంత్రి చేయాలి
– ఆంధ్రలో నీ కొడుకు లోకేష్ ని ఎవరూ కోరుకోవడం లేదు
– తెలంగాణలో షర్మిల, కేఏ పాల్ అయినట్టే చంద్రబాబు అవుతాడు
– తెలంగాణలో చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

(హనుమకొండ): చంద్రబాబు తెలంగాణలో ఫెయిల్ అయి.. ఆంధ్రలో ఫెయిల్ అయి ..ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని నిజంగా చంద్రబాబుకు టిడిపిపై, ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ ను అధ్యక్షుడుగా చేసి, ముఖ్యమంత్రి చేయాలని అప్పుడే ఆయన చిత్తశుద్ధి తెలుస్తుంది అన్నారు.లేకపోతే తెలంగాణలో చంద్రబాబు షర్మిల, కేఏ పాల్ అయినట్టే అవుతారు అని ఎద్దేవా చేశారు.

హనుమకొండలో “రైతు కల్లాలు – కేంద్ర ప్రభుత్వ వైఖరి” పై నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుపై మాట్లాడారు. టిడిపి టిడిపి తెలంగాణలో ఫెయిల్ అయింది.ఆంధ్రాలో ఫెయిల్ అయింది. ఎక్కడ పొద్దుపోతలేదు. ఇక్కడికి వచ్చి చిచ్చుపెట్టాలని కాంగ్రెస్సోలను కలుపుకొని గతంలో ఒక ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయింది.ఇప్పుడు బిజెపి వాళ్లతో ములాఖత్ అయినట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ. ఆయన మధ్యలో వచ్చారు. ఎన్టీ రామారావు స్ఫూర్తి.. ఎన్టీ రామారావు పేద ప్రజలకు చేసిన సేవ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మర్చిపోలేదు.పేదల స్కీమ్స్ తెచ్చింది ఎన్టీ రామారావు. అది నువ్వు కాదు.

ఎన్టీ రామారావు స్ఫూర్తి తీసుకొని, ఎన్టీ రామారావుతో పని తీసుకొని, ఎన్టీ రామారావుతో బతికినవు. ఆ తరవాత ఆ కుటుంబాన్ని మోసం చేసినవు. నీ కొడుకుని ఆంధ్రలో పెట్టి, పాపం హరికృష్ణ బిడ్డను తెలంగాణలో పెట్టావు. అది కక్ష సాధింపు కాదా..? జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీలో కోరుకుంటున్నారు.ఆయనను అధ్యక్షునిగా కోరుకుంటున్నారు. లోకేష్ ని కోరుకోవడం లేదు.

ఆంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నీ కొడుకు కావాలని కోరుకోవట్లేదు.కానీ లోకేష్ ని ఎంకరేజ్ చేస్తున్నావ్. నీకు తెలుగుదేశంతో పార్టీ మీద విశ్వాసం ఉన్నా.. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి చేయి.అప్పుడు తెలుగుదేశం మీద ఎంత విశ్వాసం ఉంది? ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉంది తెలుస్తుంది. లేకపోతే షర్మిల, ఏమైందో తెలుసు.. పాల్ ఏమైయ్యాడో తెలుసు… సేమ్ అదే టైపులో చంద్రబాబు అయితడు.

LEAVE A RESPONSE