Suryaa.co.in

Andhra Pradesh

ఏ పరిశ్రమ ఏపీకి రాకూడదని చంద్రబాబు పూజలు చేస్తున్నారు

గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూరుకుపోవడం వల్ల 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్ళింది. నీటి ప్రవాహం అధికం ఉండటం వల్ల రెండు రోజుల నుండి స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేక పోయాం. కొన్ని గేట్లు బాగాలేదని ఇప్పటికే నివేదిక ఇవ్వటంతో రిపేర్ల కోసం అనుమతి ఇచ్చాం. గేట్లు బాగుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. అవసరమైతే నాగార్జున సాగర్ నీటితో రిజర్వాయర్ నింపుతాం. కొందరు కావాలని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు.

ఐదారేళ్ళ నుండి తుప్పు పట్టడం వల్లే ఘటన జరిగింది. రెండు గేట్లు బాగలేకపోవటంతో ఇప్పటికే స్టాప్ లాక్స్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం డ్యాం సేఫ్టీ కోసం రూపాయి ఖర్చు చేయలేదు. రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకోవాలని చూడటం సరైనది కాదు. చంద్రబాబు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పరిశ్రమ ఏపీకి రాకూడదని చంద్రబాబు పూజలు చేస్తున్నారు. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది. ప్రాజెక్ట్ వద్దని యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆరు కోట్ల రూపాయలు డబ్బు టీడీపీ డ్యాం కోసం ఖర్చు పెట్టలేక పోయింది.

గత ప్రభుత్వం డ్యాంలను అశ్రద్ద చేయటం వల్లే ఈ పరిస్థితి. ఇప్పుడు గుండ్లకమ్మలో ఉన్న 3.4 టీయంసీ నీటిలో 2 టీయంసీలు సముద్రంలో విడుదల చేయక తప్పదు. పులిచింతలలో కూరుకుపోయిన గేట్లు రిపేర్ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్నీ ప్రాజెక్టులలో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవం. ఇవన్నీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఏమి జరగలేదు. సీఎం జగన్ పై అనవసర ఆరోపణలు చేసి లబ్ది పొందాలని చూస్తే ఉపయోగం లేదు. అన్నీ డ్యాంల సేఫ్టీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది..

LEAVE A RESPONSE