Suryaa.co.in

Andhra Pradesh

నాయీబ్రాహ్మణులు కాలర్‌ ఎగిరేసి బతికేలా సీఎం జగన్‌ చేశారు

-లోకేష్‌ నోరు తెరిస్తే పీకుడు భాషే మాట్లాడుతున్నాడు
-చంద్రబాబు చీకటికి ప్రతినిధి.. వైయస్‌ జగన్‌ వెలుగులకు ప్రతినిధి
-చంద్రబాబు పార్టీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలి
-175 కి 175 సీట్లు కొట్టటమే‌ లక్ష్యంగా పని చేయాలి
-వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చీకటికి ప్రతినిధి, ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి వెలుగులకు ప్రతినిధి అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. చంద్ర‌బాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తార‌ని, బీసీల తోకలు కత్తిరస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశార‌ని గుర్తు చేశారు. చంద్రబాబుకు బీసీలంటే చిన్న చూపు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లిలోని నాయీబ్రహ్మణ కృతజ్ఞతా సభలో సజ్జల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో జరిగిందంతా నీచ రాజకీయమేనని స‌జ్జ‌ల ధ్వజమెత్తారు. మీడియాని అడ్డం పెట్టుకుని కావాల్సిన రీతిలో వార్తలు రాయించుకునే తత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే బీసీలకు నిజమైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని చెప్పారు. చంద్రబాబు తాను చదువుకున్న స్కూల్‌నే పట్టించుకోలేదని విమర్శించారు. టీడ్కో ఇళ్లు కటించలేక పునాదుల దశలోనే చంద్రబాబు వదిలేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లను పూర్తి చేశారని తెలిపారు. లోకేష్‌కు మాత్రం ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేమీ చంద్రబాబు నేర్పలేదన్నారు. లోకేష్‌ నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మీడియ బలం తప్ప మరేమీ లేదని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చట్ట సభలో అవకాశం దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పార్టీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు కొట్టడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.

సంక్షేమం అంటే ఉండాలో చేసి చూపించిన వ్యక్తి జగన్‌ అని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కొనియాడారు. నాయీ బ్రాహ్మణులు కాలర్‌ ఎగిరేసి బతికేలా సీఎం జగన్‌ చేశారని సజ్జల పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి నాయీ బ్రాహ్మణులు అండగా నిలవాలని సూచించారు. నాయీ బ్రాహ్మణులకు ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారని, చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. త్వరలో ఎమ్మెల్సీ కూడా వచ్చి తీరుతుందన్నారు. టీడీపీ ప్రచార ఆర్భాటాలలో పడిపోకుండా వాస్తవాలేంటో గ్రహించాలని తెలిపారు.

దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను తెచ్చి అందరికీ న్యాయం చేశార‌ని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్ళీ వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం వచ్చాకనే ఆ పథకాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌కేజీ నుంచి విదేశాల్లో చదువుకునే వరకు మన పిల్లలకు అన్నీ వసతులు కల్పిస్తున్నారు.

ఏనాడూ చంద్రబాబు సొంతంగా అధికారంలోకి రాలేదు. 2014-19 మధ్య అవకాశం వచ్చినా ప్రజలకు ఏమీ చేయలేదు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అంతటా అవినీతి, అక్రమాలే. టిడ్కో ఇళ్లు కట్టించలేక పునాదుల దశలోనే చంద్రబాబు వదిలేశారు. జగన్ వచ్చాకే వాటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నారు. మనం కట్టించిన ఇళ్ల దగ్గర సెల్ఫీలు తీసుకుని మనకే సవాల్ చేస్తున్నారు. వీటిని ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేసుకుంటోంది. లోకేష్‌కుఏం పీకుతున్నారనే మాట తప్ప మరేమీ నేర్పలేదేమో?. నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మీడియా బలం తప్ప మరేమీలేదు.

వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు
చంద్రబాబు చీకటికి ప్రతినిధి, జగన్ వెలుగులకు ప్రతినిధి. చంద్రబాబు ఒక దోపిడీ మందను తయారు చేసుకున్నారు. కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పటం ఆయనకే సాధ్యం. నిజాలు చెప్తే చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందని వైయ‌స్ఆర్‌ అంటూ ఉండేవారు. అది నిజమే అన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తుంది. వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు. నా వల్ల మేలు జరిగితేనే ఓటెయ్యమని అడిగే ధైర్యం వైయ‌స్ జగన్‌ది.

కుల వృత్తులకు అండగా సీఎం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం
బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇవ్వగలిగాం. నిజమైన అర్హత బీసీలకు కూడా ఉన్నందునే జగన్ అన్ని పదవులు ఇవ్వగలిగారు. జగన్ ఓట్ల కోసం చేయటం లేదు. అందరి ఆత్మగౌరవం పెరగాలని చూస్తారు. కులవృత్తులకు అండగా నిలవటం ప్రభుత్వం బాధ్యతగా చూస్తుంది. చేదోడు పథకం ద్వారా పదివేలు చొప్పున మూడేళ్లుగా అందిస్తున్నాం. పోటీతత్వం పెరుగుతున్నందున మనం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. చంద్రబాబు పార్టీని వచ్చే ఎన్నికలలో వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు. లేకపోతే సామాన్యులు బతకలేరు. గత ఎన్నికలలోనే గట్టిగా దెబ్బ కొట్టినా మళ్ళీ వస్తున్నాడు. ఈసారి రాజకీయంగా అంతం చేయాలి. 175 కి 175 సీట్లు కొట్టటమే‌ లక్ష్యంగా పని చేయాల‌ని సజ్జల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారు: బీసీ మంత్రులు
బీసీల తోక‌లు క‌త్త‌రిస్తానంటూ చంద్ర‌బాబు అవ‌హేళ‌న చేశార‌ని బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిప‌డ్డారు. సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందించడం, ఆలయాలలో పనిచేసే వారికి రూ, 20 వేల వేతనం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాల పాలకమండలిలో స్థానం కల్పించడంపై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు.

బీసీలకు సీఎం వైయ‌స్ జగన్‌ అన్ని విధాల అండగా నిలిచారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో వైయ‌స్ జగన్‌ బీసీల కష్టాల చూశారని గుర్తు చేశారు. ఆలయాల పాలక మండలిలో నాయీబ్రాహ్మణులు సభ్యులయ్యారని, త్వరలోనే నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభల్లో అడుగుపెడతారని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఆయనకు బీసీలంటే చిన్నచూపని మంత్రులు విమ‌ర్శించారు.

LEAVE A RESPONSE