Suryaa.co.in

Andhra Pradesh

ఏపీని శ్రీలంక చేయాలని పరితపించిపోతున్న చంద్రబాబు

– ప్రజల ఆశీస్సుల ముందు పచ్చ పక్షాల సవాళ్లు, శపథాలు ఫలించవు
– విలువలకు తిలోదకాలిచ్చి ఎవరితోనైనా జతకట్టేందుకు చంద్రబాబు రెడీ
– చిట్టి నాయుడు (లోకేష్) చిప్ కరెప్ట్ అయ్యింది
– జిల్లాల పునర్వ్యవస్థీకరణతో బలోపేతమైన పోలీస్ వ్యవస్థ
– ఏపీ పెండింగ్ అంశాలు, విభజన సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోది
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

ఏపీని శ్రీలంక చేయాలని చంద్రబాబు పరితపించిపోతున్నాడని, ఆ కలను సాకారం చేసుకునేందుకు పగటి కలలు కంటున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. చంద్రబాబు ఏది నోటికొస్తే అది మాట్లాడడం, దాన్ని ఎల్లో కుల మీడియా బ్యానర్ గా వేయడం పరిపాటిగా మారిందని అన్నారు. ప్రజల ఈ కుత్రంత్రాలన్నీ గమనిస్తూనే ఉన్నారని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి శాశ్వత వీడ్కోలు చెబుతారని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేంది ప్రజలేనని, 2014లో మోదీని పీఎం కానివ్వనంటూ ముంబైలో సోనియా శపథం చేసారని, మోదీ టీ అమ్ముకో అంటూ మరొకరు ఎగతాళి చేసి మాట్లాడారని, వాటికి సమాధానంగా మోదీని ఏకంగా పదేళ్ళు ప్రధాని కుర్చీపై ప్రజలు కూర్చోబెట్టారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి సవాళ్లే కొన్ని పార్టీలు చేస్తున్నాయని, 2024లో జగన్మోహన్ రెడ్డిని సీఎం కానివ్వబోమంటూ శపథాలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పాలనతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారుని, ప్రజల ఆశీస్సుల ముందు ఈ శపథాలు, సవాళ్లు ఫలించవని అన్నారు.

ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా అని ఎవరెన్ని రకాలుగా పాడుకున్నా చంద్రబాబు నామోషీ పడరని,అవసరమైతే మళ్ళీ బీజేపీ ముందు మోకరిల్లుతారని,వాళ్లు నో అంటే కాంగ్రెస్ ఉండనే ఉందని, ఇక కొడవలి పార్టీ వాళ్లు ఎలాగూ చుట్టాలేనని ఏద్దేవా చేసారు. రాజనీతిపై చంద్రబాబుకు నమ్మకం లేదని,ప్రతీది బిజినెస్ లానే చూస్తారని, అవసరమైతే ఎన్ని కోట్లైనా ఫండింగ్ చేయడానికి సిద్దపడతాడని అన్నారు .

కొత్త జిల్లాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు, థాంక్యూ సీఎం సార్ నినాదాల హోరుతో పచ్చ బ్యాచ్ కు నిద్ర కరువైందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే జిల్లాలకు న్యాయం చేస్తామని చెబుతున్న చంద్రబాబు ఇన్నేళ్ళూ నిద్రపోయారా అని ప్రశ్నించారు.

మంత్రిగా మూడేళ్ళు పనిచేసిన చిట్టినాయుడు (లోకేష్‌) దోచుకోవడంలో ఆరితేరిపోయి జనాన్ని నిలువునా ముంచేసి తండ్రిని ఎంతగానో మురిపించాడని అన్నారు. జేబు దొంగలు తాము కొట్టేసిన సొమ్ములో పంచాల్సిన వాటాలకు రకరకాల కోడ్ పేర్లు పెట్టుకుంటారన్నట్లు ఆ టాక్స్, ఈ టాక్స్ అంటూ జేబుదొంగల బాష మాట్లాడుతున్నాడని చిట్టినాయుడు చిప్ కరెప్ట్ అయ్యిందని అన్నారు.

పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా కొత్త రూపు సంతరించుకుందని. 18 జిల్లా యూనిట్లుగా ఉన్న పోలీస్ వ్యవస్థ 26 యూనిట్లుగా రూపాంతరం చెందిందని అన్నారు. వీటిలో 24 పోలీస్ జిల్లాలు కాగా విశాఖపట్నం, విజయవాడలు పోలీస్ కమిషనరేట్లని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో 6 జిల్లా పోలీస్ యూనిట్లను ఏర్పాటు చేసిందని అన్నారు.

ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు, విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రెవెన్యూ లోటు, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణ విద్యుత్ బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత తదితర అంశాలపై చర్చించారని అన్నారు. చర్చించిన సమస్యలపై ప్రధాని మోది సానుకూలంగా స్పందించారని అన్నారు. ఢిల్లీ పర్యటనలో బాగంగా సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి మంత్రి జి ఎస్ ఎస్ జోధ్ పుర్ లతో విడివిడిగా భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారని అన్నారు.

LEAVE A RESPONSE