– అయ్యన్న ఒక పోరంబోకు
– నర్సీపట్నాన్ని గంజాయికి అడ్డాగా మార్చింది మీరు కాదా?
– జన్మభూమి కమిటీల బ్రోకర్ల దయతోనే నాడు పింఛన్
– 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా?
–ః అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఫైర్
అయ్యన్న ఒక పోరంబోకు
అయ్యన్న పాత్రుడు స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నాడు. అయ్యన్నపాత్రుడూ… మాకు బూతులు రావా? మేం తిట్టలేమా? “అయ్యన్న ఒక గంజాయి దొంగ నాకొడుకు … ఒక కేటు నాకొడుకు… ఒక సైకో, శాడిస్ట్, ఒక చెత్తనా కొడుకు, వెధవ, ఒక పోరంబోకు…” అని మేమనలేమా?. మాకు బూతులు రావనుకుంటున్నావా? మా నాయకుడు జగన్ గురించి ఇంకొక్కసారి మాట తూలినా, నిన్ను గాని, మీ నాయకుడు చంద్రబాబును గాని వదలేది లేదు. మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే.. మీపైన మేమూ అంతే స్థాయిలో బూతులు మాట్లాడతాం.
మీరంతా సైకోగాళ్ళు
నీవు, మీ నాయకుడు చంద్రబాబు, నారా లోకేశ్ ల కంటే సైకోగాళ్ళు ఎవరు ఉంటారు..?. అయ్యన్నపాత్రుడు మందు ఎక్కువై మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. టీడీపీ హయాంలో వందల కోట్లు అక్రమంగా సంపాదించిన అయ్యన్నపాత్రుడు, సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. జగన్ నర్సీపట్నం వస్తే.. అడ్డుకుంటానని వాగాడు. దమ్ముంటే అడ్డుకోమని నేను ఆరోజున సవాల్ చేస్తే… పారిపోయిన పిరికి సన్నాసి అయ్యన్న. సీఎం నర్సీపట్నం వచ్చిన రోజున నువ్వేం చేయగలిగావు? నువ్వు ఇంట్లో దాక్కున్నావు. నాలుగు గంటలు సీఎం నర్సీపట్నంలో ఉంటే నువ్వేం పీకావు?.
గంజాయికి అడ్డాగా మార్చింది మీరు కాదా?
ఎన్టీఆర్ నీకు రాజకీయ భిక్ష పెడితే.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచావు.మంత్రిగా ఉండి నువ్వు, మీ నాయకుడు చంద్రబాబు నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చారు. నీవు ఉత్తరాంధ్రలో గంజాయి డాన్ గా, దొంగగా నీ పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని నువ్వు, మీ నాయకుడు కలిసి దోచుకున్నారు.. టీడీపీ హయాంలో ఈ రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రను దోచుకున్న దొంగలెవరైనా ఉన్నారంటే అది నువ్వు, నీ నాయకుడు చంద్రబాబే.ఈ రోజు ఇదేంఖర్మ అంటూ జనం వద్దకు వెళ్తుంటే మీ టీడీపీని, మిమ్మల్ని జనం మొఖం మీదే ఛీకొడుతున్నారు. ఇంతకన్నా మీకు అవమానం ఏం కావాలి?
జన్మభూమి కమిటీల బ్రోకర్ల దయతోనే నాడు పింఛన్
టీడీపీ హయాంలో ఇచ్చిన పింఛన్ మొత్తం రూ.1000. అదీ సుమారు 57 నెలలు ఇచ్చి, ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నాయనేసరికి అప్పుడు రూ. 2000 పెంచారు. అదీ జన్మభూమి కమిటీల బ్రోకర్ల దయ ఉన్న కొద్దిమందికి మాత్రమే పింఛన్లు దక్కాయి. నాడు జగన్ పాదయాత్రలో జనం కష్టాలను చూసి చలించిపోయి, అవ్వాతాతలకు ఈ రోజు రూ.2750 పింఛన్ ఇస్తున్నారు. పాదయాత్రలో మాటిచ్చిన మేరకే జగన్ విద్యార్థుల చదువు కోసం అమ్మ ఒడి ద్వారా రూ.15000 ఇస్తున్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే మా జగన్ .
నువ్వు గాని, నీ నాయకుడు చంద్రబాబు కాని చదువుకునే పిల్లలకు ఒక్కపైసా అయినా విదిల్చారా?
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలలో రెండు రూపాయలకే టిఫిన్, రూ. 5 కే భోజనం అన్నారు. పేదలు మీ మాటలు నమ్మి, మీకు ఓట్లేస్తే మీరేం చేశారు? రాష్ట్రంలో మీరు పెట్టిన క్యాంటీన్లు ఎన్ని? మీరెంతమందికి భోజనం పెట్టారు. అన్న క్యాంటీన్ల పేరుతోనూ దోపిడీ చేశారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని 2014 బాబు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు. నర్సీపట్నంలో ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎందరికి నిరుద్యోగ భృతినిచ్చారు చెప్పండి చూద్దాం.
వాలంటీర్ల వ్యవస్థపై అవాకులు చవాకులు
మీరుఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయని మీరు, నూటికి 99 శాతం హామీలు నెరవేర్చిన మా జగన్ గురించి, ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల అమలుకు వలంటీర్లు విస్తృత సేవలు అందిస్తున్నారు. మీ జన్మభూమి కమిటీల బ్రోకర్ల మాదిరిగా కాకుండా నిస్వార్థంగా పైసా ఎవరి వద్దా లంచాలు తీసుకోకుండా వాలంటీర్లు సేవచేస్తుంటే వారి గురించి అవాకులు చవాకులు పేలడానికి నీకు, మీ పార్టీ వాళ్లకు నోరెలా వస్తోంది? పక్క రాష్ట్రాలు సైతం వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. అదీ ఆ వ్యవస్థ గొప్పతనం. మా ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనకు నిదర్శనం.
175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా?
మాధైర్యం జగన్ . దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మరో 30 ఏళ్లు మా జగన్ ముఖ్యమంత్రి. మీరెంత నోరు పారేసుకున్నా జగన్ గారిని కాలిగోటికి కూడా సరితూగరు. వేయి మంది చంద్రబాబులు వచ్చినా, లక్షమంది అయ్యన్నపాత్రుళ్లు వచ్చినా జగన్ ని ఏమీ చేయలేరు. నువ్వు హోంమంత్రివై పోయినట్లు పగటి కలలుగని పోలీసులను బట్టలూడదీస్తామంటున్నావు. నీపై కేసు పెట్టడానికి పోలీసులు నీ ఇంటికి వస్తే…పిల్లిలా దాక్కున్నావు. నీకు సిగ్గుందా?జనసేనతో టీడీపీ కలిస్తే మాకెందుకు భయం? ఆ మాటనడానికి మీకు సిగ్గుందా? మీరు అన్ని పార్టీల చుట్టూ తిరుగుతూ ఎవరు కలుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. జగన్ సింగిల్ గానే వస్తారు. 175 సీట్లూ గెలుస్తారు.
నర్సీపట్నానికి అయ్యన్నపాత్రుడు చేసింది సున్నా
గత ఎన్నికల ప్రచారంలో..నర్సీపట్నంలో పెద్దచెరువుకు ట్యాంక్ బండ్ కడతానన్నావు. శిలాఫలకం వేసి వదిలేశావు. ఇండోర్ స్టేడియం, ఇంటింటికీ తాగునీరు, రోడ్లు విస్తరణ, కొత్తవీధిలో కళ్యాణమండపం వంటివి కట్టిస్తానని ప్రగల్భాలు పలికావు. చివరికి అక్కడ నువ్వేసిన శిలాఫలకాలు సమాధి ఫలకాలుగా మిగిలాయి తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. అయిదేళ్లలో నువ్వు శిలాఫలకాల మంత్రిగానే మిగిలావు.
జగన్ వల్లే నర్సీపట్నానికి ప్రగతి
2019 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ, జగన్ గారు నర్సీపట్నం వచ్చిన సందర్భంలో, మున్సిపల్ పన్ను ఇబ్బందులు గురించి చెప్పగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 శాతం ఇంటిపన్ను తగ్గించారు. ఇదీ ఆయన ఘనత.నర్సీపట్నానికి రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని జగన్ చెప్పారు. రూ. 470 కోట్లతో పత్తిపాడు, తుని రైతులను ఆదుకునేలా ఏలేరు నుంచి తాండవ రిజర్వాయర్ అనుసంధానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నర్సీపట్నంలో రోడ్ల విస్తరణను రూ. 16 కోట్లతో చేస్తామని మాటిచ్చారు అని ఎమ్మెల్యే గణేష్ వివరించారు.