మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ : నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా ఉండాలని, నారా చంద్రబాబునాయుడు గారిని వెంటనే విడుదల చేయాలంటూ చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ శివాలయం నుంచి నందిగామ శివాలయం వరకు పాదయాత్రగా వస్తున్న తెదేపా శ్రేణుల పాదయాత్రకు సంఘీభావంగా నందిగామ పట్టణం శ్రీ రామలింగేశ్వర నగర్ శ్రీ సాయి అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద మిత్రపక్ష జనసేన నేతలు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి స్వాగతం పలికి వారి పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
అన్యాయాలు,అక్రమాలు రాష్ట్రాన్ని నలుదిశలా పాలిస్తున్నాయి.సైకో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు.చేయని నేరానికి నారా చంద్రబాబు నాయుడు ని జైలు పాలు చేసి జగన్ రెడ్డి పైసాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు గ్రామాలు గ్రామాలు అట్టుడికిపోతున్నాయి.
ఈ రోజు ఈ పాదయాత్రలో మహిళలు సైతం కదం తొక్కి ఇళ్లను వదిలి గ్రామాలను సైతం దాటుకొని ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రజానీకం సైకో పోవాలి…సైకిల్ రావాలి అంటున్నారు. రానున్న ఎన్నికలలో వైసిపి పార్టీని రాష్ట్ర ప్రజానీకం భూస్థాపితం చేయడం తథ్యం.