Suryaa.co.in

Andhra Pradesh

దత్తపుత్రుడి ఇల్లాలు మూడు నాలుగేళ్లకు మారుతుంది

వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు
బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి
చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణకు సీఎం జగన్‌ కౌంటర్‌

సామర్లకోట : సామర్లకోటలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది.

ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్‌. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్‌.

వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి.

రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువు, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు అని జగన్ అన్నారు.

LEAVE A RESPONSE